ఆ పాటలకు డాన్స్ చేయలేకపోయా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధృవ చిత్రానికి సంగీతం అందించిన హిప్ హాప్ తమిళ పాటలకు డాన్సు చేయలేకపోయా. తమిళ్‌లో ఎంత బాగా సంగీతం అందించారో, తెలుగులో అంతకన్నా బాగా చేశారని నటుడు రామ్‌చరణ్ తెలిపారు. గీతా ఆర్ట్స్ పతాకంపై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ రూపొందించిన ‘్ధృవ’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. చిత్ర యూనిట్ ఆధ్వర్యంలో ‘శాల్యూట్ టూ ఆడియన్స్’ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించిన సందర్భంగా రామ్‌చరణ్ మరిన్ని విశేషాలు చెబుతూ, ఈ సినిమా మాతృక చూసి తెలుగులో చేయడానికి ఒప్పుకొన్నట్లు తెలిపారు. ‘మగధీర’ తరువాత ఓ మంచి చిత్రం రావడానికి నాలుగేళ్ల సమయం పట్టిందని తెలిపారు. తన తల్లి ఆనందం కోసమే ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కష్టపడ్డామని, ఇప్పుడు చాలా ఆనందంగా వుందని అన్నారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత వనె్న తెచ్చిందని, ‘పరేషాన్’ పాటలో తన కన్నా రకుల్ అద్భుతంగా డాన్స్ చేసిందని, కొత్త కథలు చేయాలి అనుకున్నప్పుడు నెంబర్స్‌ను తాను పట్టించుకోనని, రికార్డుల గురించి కూడా ఏదీ ఆలోచించనని వివరించారు. పెద్దనోట్లు రద్దయిన నేపథ్యంలో ఈ సినిమా విడుదల చేయడానికి చాలా ఆలోచించామని, మరోవైపు చిరంజీవి సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ధైర్యం చేసి విడుదల చేశామని, మగధీర తరువాత పెద్ద హిట్ దక్కడంతో హ్యాపీగా వుందని అల్లు అరవింద్ అన్నారు.
మంచి కథ వుంటే సినిమాను ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని ఈ చిత్రం నిరూపించిందని, 50 కోట్లను దాటిన సినిమా వంద కోట్లకు చేరాలని కథానాయిక రకుల్ తెలిపారు.
ఈ సినిమాకు దర్శకుడిగా తనను ఎంపిక చేసుకోవడంతో హిట్ దక్కిందని, ఈ స్టెప్ తీసుకోకపోతే ఈ విజయం లభించేది కాదని దర్శకుడు సురేందర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో హిప్ హాప్ తమిళ, పోసాని కృష్ణమురళి, ఉసేన్ అలీ, రణవీర్, వేమారెడ్డి, చంద్రబోస్, రాజు, నవదీప్, వరికుప్పల యాదగిరి తదితరులు పాల్గొని విశేషాలను తెలిపారు.