ఎవర్నీ అనుకరించను..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామెడీ హీరోగా ఓ ఇమేజ్ తెచ్చుకున్న రాజేంద్రప్రసాద్ తరువాతి తరంలో ఆ లోటును భర్తీచేశాడు అల్లరి నరేష్. ఒకప్పుడు వరుస విజయాలు అందుకున్న ఆయనకు ఈమధ్య సరైన హిట్స్ లేవు. తాజాగా దెయ్యం సినిమాతో భయపెట్టాలని ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ అంటూ ముందుకు వస్తున్నాడు. జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ రూపొందించిన ఈ సినిమా ఈనెల 30న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నరేశ్ చిత్ర విశేషాలను తెలిపారు.
ఈ ఏడాది స్పీడు తగ్గింది
వ్యక్తిగతంగా మాత్రం నాకిది మంచి సంవత్సరం. ఈ ఏడాది తండ్రి ప్రమోషన్ వచ్చింది. ప్రస్తుతం ఆ పాత్రలో ఎంజాయ్ చేస్తున్నా. వృత్తిపరంగా ఈ ఏడాది సెల్ఫీరాజా ఒక్కటే విడుదలైంది. ఇప్పుడు ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ ఏడాది నా స్పీడు తగ్గిందనే చెప్పాలి.
నోట్ల రద్దు ప్రభావం
డిమానిటైజేషన్ ప్రభావం సినీ రంగంపై లేనే లేదు. అన్ని రంగాలపై పడింది. ‘ఇంట్లో దెయ్యం..’ నవంబర్ 12న విడుదల కావాల్సింది. కానీ జనమంతా డబ్బుల కోసం క్యూలో నిలబడి వుండడంతో థియేటర్లకు ఎవరు వస్తారని సినిమాను వాయిదావేశాం. ఇప్పుడు కలెక్షన్ల పరిస్థితి బాగానే వుంది. అప్పటినుండి ఏదో ఒక సమస్య ఎదురైంది. మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్ధమవడంతో మేము 30న రావాల్సి వచ్చింది.
బ్యాండు మేళంలో..
బ్యాండు మేళం గ్రూపులో పనిచేసే పాత్రలో నటించాను. సాధారణంగా దెయ్యాలను, భూతాలను నమ్మను. ఇవన్నీ మూఢ నమ్మకాల చెప్పే వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మాంత్రికుడిగా మారి ఓ ఇంటికి వెళ్లినపుడు అక్కడ దెయ్యం వుంటే ఏం చేస్తాడు? రాని మంత్రాలను ఎలా చదువుతాడు? ఈ పాత్రలో నటించా. భయపడుతూ, భయపెట్టే పాత్ర చేశాను. దెయ్యం సినిమాలనగానే ఓ పాత ఇంట్లోనో, పాడుబడిన ఇంట్లోనో అది వుంటుంది. కానీ ఈ సినిమాలో ఓ పెళ్లివారి ఇంట్లోకి దెయ్యం వస్తే ఎలా వుంటుంది అనేదే కథ.
మగధీర లాంటిది
సుడిగాడు సినిమా నాకు మగధీర లాంటిది. ఆ సినిమా నాకెంతో మంచి చేసిందో అంతే చెడు కూడా చేసింది. సినిమా టైటిల్ నవ్వించాలని అందరూ అనుకోవడంతో ఫైట్స్, డాన్సులు, సెంటిమెంట్ సీన్లలో కామెడీ చేయడం మొదలుపెట్టా. నా పాత సినిమాల్లో చిన్న ఎమోషన్ కూడా వుండేది. అది ప్రేక్షకులు ఫీలై సినిమా విజయవంతమయ్యేవి. సుడిగాడు తరువాత అలాంటి సన్నివేశాలను పక్కనపెట్టేశాం. కథ కోసం కామెడీ చేయాలి కానీ, కామెడీ కోసం సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నాను.
ఇక ఎవర్నీ అనుకరించను..
ఏ హీరోలను అనుకరించ కూడదని గట్టి నిర్ణయం తీసుకున్నాను. నా దగ్గరికి వచ్చే దర్శక, నిర్మాతలకు ఈ విషయానే్న చెబుతున్నాను. దొంగల బండి, సుడిగాడు సినిమాల వరకు ‘అనుకరణ’లు (స్పూఫ్‌లు) చేశా. అలా చేసినపుడు వేరే నటుల అభిమానులు ఫీల్ కాకూడదని నన్ను నేను తక్కువ చేసుకున్నాను. ఇప్పుడు అలా చేయకూడదని నిర్ణయం తీసుకున్నా. ఇంతకుముందు చేసిన లడ్డుబాబు, బందిపోటు సినిమాల్లో ఎలాంటి అనుకరణలు లేవు.
దెయ్యాలను నమ్మను
దెయ్యాలు ఉన్నాయని నమ్మేవాళ్ల గురించి నాకు తెలియదు కాని, నేను నమ్మను. అవన్నీ మన మైండ్ సెట్‌కు సంబంధించినవి. ఈవిల్ డెడ్ సినిమా చూసినప్పుడు భయపడ్డాను. తాజాగా డోంట్ బ్రీత్ చూసేటప్పుడు కూడా థ్రిల్‌గా ఫీలయ్యాను. నవరసాల్లో భయం కూడా ఒకటి. పెద్ద నిర్మాతలు ఎప్పుడూ పెద్ద సినిమాలే కాకుండా చిన్న సినిమాలు కూడా చేయాలి. అలా చేస్తే పరిశ్రమ బావుంటుంది.
అన్నీ చేస్తా
యాక్షన్ సినిమాలు చేసేంత ఫిజిక్ నాదగ్గర లేదని అనుకుంటాను. ఇది తప్ప ఒక యాక్టర్‌గా నేను అన్ని రకాల సినిమాలు చేయాలనుకుంటాను. అయితే నా దగ్గరికి వచ్చే నిర్మాతలకు నేను చేయగలను అనుకున్నవి మాత్రమే చేస్తాను. కామెడీకి దూరంగా చేసిన ప్రయోగాలు సత్ఫలితాలు ఇవ్వలేదు. ఎందుకంటే, నా నుంచి ప్రేక్షకులు హాస్యమే కోరుకుంటున్నారు కాబట్టి.
దర్శకత్వం చేస్తా
ప్రస్తుతం నటుడిగా ఉన్నా, భవిష్యత్‌లో దర్శకత్వం చేస్తా. ఒకేసారి రెండు పడవలపై కాళ్లు పెట్టడం ఎందుకని ఊరుకున్నా. బాపు, విశ్వనాథ్ వంటి సీనియర్ దర్శకుల వద్ద పనిచేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నా. దర్శకుడిగా నేను వందశాతం సిద్ధంగా లేను. 2020 మేలో దర్శకుడిగా ఓ సినిమా విడుదల చేస్తా.
తదుపరి చిత్రాలు
మలయాళ సినిమా ఒరు ఒడక్కన్ సెల్ఫీని అలా ఎలా ఫేం అనీష్ దర్శకత్వంలో చేయనున్నాను. ఫిబ్రవరిలో సెట్స్‌కు వెళ్లనుంది. భీమనేని శ్రీనివాసరావుతో మరో సినిమా. కొత్త దర్శకుడు సతీష్‌తో ఒకటి చేస్తా.

-శ్రీ