నోట్ల రద్దుతో సినిమాలకు నష్టం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లరి నరేష్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర చిత్ర పతాకంపై నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ రూపొందించిన చిత్రం ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’. ఈ చిత్రం ఈనెల 30న విడుదలకు సిద్ధమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ఈమధ్య ఎక్కువగా హారర్ సినిమాలు వస్తున్నా ప్రేక్షకులను ఆకట్టుకునేలా వుంటే తప్ప విజయవంతం కావడంలేదని, ఈ సినిమాను కొత్తదనంతో తీసినందున హిట్ అవుతుందన్న నమ్మకం వుందని తెలిపారు. రాజేంద్రప్రసాద్, అల్లరి నరేష్‌లతో సాగే కామెడీ బాగా నవ్విస్తుందని, పాటలన్నీ హిట్ అయ్యాయని ఆయన అన్నారు.
సాయికార్తీక్ అందించిన సంగీతానికి మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. అల్లరి నరేష్ సినిమాలో ప్రేక్షకులు కోరుకునే కామెడీ ఎంత వుండాలో అంతకన్నా ఎక్కువగా ఈ చిత్రంలో వుండేలా జాగ్రత్తలు తీసుకుని నిర్మించామని వివరించారు. దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డి సినిమాలో కామెడీకి ఎంత స్కోప్ వుంటుందో తెలిసిందేనని, హారర్ కామెడీ జోనర్‌లో దీన్ని తీర్చిదిద్దామని తెలిపారు. పెద్దనోట్ల రద్దుతో సినిమాలకు పెద్దగా నష్టం ఏమీ లేదని, సినిమా బాగుంటే కలెక్షన్లు బాగానే వస్తాయని, యావరేజ్ సినిమాలకే సమస్య వచ్చిందని ఆయన తెలిపారు. ఈ ఏడాది సంక్రాంతికి నాన్నకు ప్రేమతో లాంటి మంచి కమర్షియల్ హిట్ అందుకున్నామని, ఇప్పుడు ఏడాది చివరలో మరో హిట్ లభిస్తుందన్న నమ్మకం వుందని తెలిపారు. వచ్చే ఏడాది రెండు సినిమాలను రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నామని, చిన్న బడ్జెట్ సినిమా చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని వివరించారు.