రెండో షెడ్యూల్లో రైట్ రైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా మను దర్శకత్వంలో శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘రైట్ రైట్’. ‘బాహుబలి’ ఫేమ్ ప్రభాకర్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ అరకులో పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను గురించి నిర్మాత వంశీకృష్ణ వివరాలు తెలియజేస్తూ డిసెంబర్ 7 నుంచి ఈనెల 4 వరకు ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరించామన్నారు. అరకు, ఒడిశాలో షూటింగ్ జరిపామని, రెండో షెడ్యూల్‌ని ఈనెల 23నుంచి హైదరాబాద్‌లో ప్రారంభిస్తామని, మూడవ షెడ్యూల్ మున్నార్‌లో చిత్రీకరిస్తామని చెప్పారు. సుమంత్ అశ్విన్ పాత్ర హైలెట్‌గా నిలుస్తుందని, అలాగే ‘బాహుబలి’ ప్రభాకర్ మొదటిసారి పాజిటివ్ పాత్రలో నటిస్తున్నాడని అన్నారు. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే మంచి కథ ఇదని, పూర్తిస్థాయి వినోదాత్మకంగాను, ఉత్తేజభరితంగా ఉండే ఈ సినిమా తనకు విభిన్నమైన అనుభూతిని ఇచ్చిందన్నారు. దర్శకుడు మను మాట్లాడుతూ మలయాళంలో ఘన విజయం సాధించిన ఓ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి, ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామన్నారు. ఎస్.కోటనుండి గవిటికి వెళ్లే ఓ బస్సు కూడా ఈ సినిమాలో కీరోల్ పోషిస్తుందని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జె.బి, కెమెరా: శేఖర్ వి.జోసెఫ్, కో ప్రొడ్యూసర్: కె.శ్రీనివాసరాజు, నిర్మాత: వంశీకృష్ణ, దర్శకత్వం: మను.