నవ్వించే.. వర్మ వర్సెస్ శర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్టర్ నార్ని చంద్రాంషువు సమర్పణలో పాలిన్‌డ్రోమ్ పిక్చర్స్ పతాకంపై బి.్భవన విజయ్ దర్శకత్వంలో కామెడీ సెటైర్‌గా రూపొందిన చిత్రం ‘వర్మ పఒ శర్మ’. బాబ్ రతన్, బిందు బార్బీ జంటగా నటించగా, గిరిబాబు, జూ.రేలంగి టైటిల్ రోల్స్ పోషించారు. ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో చాలాభాగం షూటింగ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ,వర్మ-శర్మల పాత్రలు నమ్మకం, మూఢ నమ్మకాలపై కామెడీ కోణంలో రూపొందించామని అన్నారు.
ఎక్కువ శాతం ప్రాంతీయ కళాకారులతో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఆడియో విడుదల చేశామని తెలిపారు. హీరో బాబ్త్రన్ మాట్లాడుతూ, సామాజిక అంశాలున్న కథ తనకు నచ్చిందని, డాక్టర్‌గా తనను ఆదరించిన ప్రజలు ఇక యాక్టర్‌గా గుర్తిస్తారని అన్నారు. దర్శకుడు బి.్భవన విజయ్ మాట్లాడుతూ- వర్మ, శర్మలపాత్రలు టైటిల్‌కు తగ్గట్లే సరదాగా ఉంటాయన్నారు. మాటలు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అని అన్నారు. జూ.రేలంగి, బాబ్త్రన్, బిందు బార్బీ, దీక్షితులు, రమణ సూరంపూడి, అడ్డకర్ల, బాబులు, గాంధి, ఉదయబాబు, నరసింహమూర్తి, తిరుపతిరావు, అజయ్, శ్రీరామ్, వాసు, బుల్లబ్బాయి, భారతి, లలిత, వౌనిక, లక్ష్మి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:రమణ రాథోడ్, కెమెరా:జి.రంగ, ఎడిటింగ్:ప్రభు, పాటలు:రమణ లోక్, కొరియోగ్రఫి:బ్రో, ఆనంద్, నిర్మాత:నార్ని ఫణి దుర్గాప్రసాద్ (చినబాబు), రచన, దర్శకత్వం:బి.్భవన విజయ్.