ఇండో పాక్ యుద్ధం నేపథ్యంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాహుబలి’ సినిమాతో భల్లాలదేవుడిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు రానా. ప్రస్తుతం ‘బాహుబలి-2’ షూటింగ్‌లో బిజీగా వున్న రానా మరో క్రేజీ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పినట్లు తెలిసింది. సంకల్పరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం కానుందట. 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో రూపొందే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోందని సమాచారం. ప్రయోగాలు చేయడం రానాకు కొత్తకాదు. అందరికీ కనెక్ట్ అయ్యేలా ప్రయోగాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. రావు రమేష్ కీరోల్ పోషిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది.