ఎంతవరకు ఈ ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రంగం’తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన జీవా హీరోగా, గ్లామర్ డాల్ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడీ చిత్రం ‘ఎంతవరకు ఈ ప్రేమ’. డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ దీన్ని అందిస్తున్నారు. డికె దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు పూర్తవుతున్న సందర్భంగా డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ మాట్లాడుతూ, జీవా, కాజల్ కాంబినేషన్ అంటేనే మంచి అంచనాలు ఏర్పడ్డాయని, ఇటీవల విడుదలైన ట్రైలర్, పాటలకు యువత మంచి స్పందన వస్తోందని తెలిపారు. తమిళం, తెలుగులో ఒకేసారి విడుదల చేయాలనుకున్నా సెన్సార్ అవ్వకపోవడంతో తెలుగు వెర్షన్ విడుదలలో జాప్యం జరిగిందని ఆయన చెప్పారు. రంగం వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత మరోసారి అంతకుమించిన నటనతో జీవా ఆకట్టుకున్నాడన్న టాక్ వచ్చిందని, ఈ చిత్రానికి సంగీతం మరో ఆకర్షణ అని వివరించారు. లియోన్ జేమ్స్ సంగీతం, అభినందన్ సినిమాటోగ్రఫీ అందరికీ నచ్చుతాయని ఆయన తెలిపారు. బాబీ సింహా, శృతి రామకృష్ణన్, సునయన, మంత్ర తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్:టి.స్.సురేష్, నిర్మాత:డి.వెంకటేష్, దర్శకత్వం:డి.కె.