రెగ్యులర్ షూటింగ్‌లో మహేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం షూటింగ్ బ్రేక్‌లో వున్న సంగతి తెలిసిందే. మహేష్ సినిమాలకెంత ప్రాముఖ్యత ఇస్తాడో, మరోవైపు ఫ్యామిలీకి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడు. షూటింగ్‌లో ఏ కాస్త బ్రేక్ దొరికినా ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో సరదాగా గడపడం ఇష్టం. మురగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా బ్రేక్ సమయంలో కూడా విదేశాలకు వెళ్లిపోయాడు మహేష్. గత వారం పది రోజులుగా అక్కడే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న మహేష్ రెండు రోజుల్లో తిరిగిరానున్నాడు. ఆ తరువాత మురుగదాస్ సినిమాలో తదుపరి షెడ్యూల్‌లో పాల్గొంటాడు. జనవరి 7 నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే 70 శాతం పైగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ఈ షెడ్యూల్‌లోనే షూటింగ్ పూర్తిచేసి ఫిబ్రవరిలో పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రంలో అందాల భామ రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది.