కృష్ణవంశీ నక్షత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుట్టబొమ్మ క్రియేషన్స్ పతాకంపై కృష్ణవంశీ దర్శకత్వంలో విన్ విన్ విన్ క్రియేషన్స్ సమర్పణలో వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం నక్షత్రం. దీనికి హీరో రామ్‌చరణ్ ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ఆదరణ లభిస్తోందని నిర్మాతలు తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నామని, ఫిబ్రవరిలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
పోలీస్ అవ్వాలనే ప్రయత్నంలో ఉన్న యువకుడి కథ తీసుకుని, రామాయణంలో హనుమంతుడి పాత్ర ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో అంత ప్రాధాన్యత పోలీస్ పాత్రకి సమాజంలో ఉందని చెబుతూ ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శకుడు కృష్ణవంశీ తెలిపారు. సందీప్‌కిషన్ సరికొత్త లుక్‌తో కనిపిస్తారని అన్నారు. సాయిధరమ్‌తేజ్, రెజీనా, ప్రగ్యాజైస్వాల్, తులసి, జె.డి.చక్రవర్తి, ప్రకాష్‌రాజ్, శివాజీరాజా, రఘుబాబు, తనేష్, ముక్తర్‌ఖాన్, సాయికిరణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: తోట ప్రసాద్, పద్మశ్రీ, కిరణ్ తటవర్తి, సంగీతం: భీమ్స్, భారత్, పాటలు: అనంత్‌శ్రీరామ్, కాసర్ల శ్యామ్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, ఎడిటింగ్: శివ వై.ప్రసాద్, నిర్మాతలు: ఎస్.వేణుగోపాల్, సజ్జు, కె.శ్రీనివాసులు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణవంశీ.