వరుణ్‌తేజ్, శ్రీనువైట్ల మిస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై వరుణ్‌తేజ్ కథానాయకుడుగా శ్రీనువైట్ల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘మిస్టర్’. లావణ్యా త్రిపాఠీ, హెబ్బా పటేల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం గూర్చి దర్శకుడు మాట్లాడుతూ, ‘ఎమోషన్లకు, విజువల్స్‌కు, సంగీతానికి స్కోప్ ఉన్న ఈ చిత్రాన్ని చేయాలని తానెప్పటినుంచో అనుకుంటున్నానని, అందుకు తగ్గ కథ కుదిరిందని తెలిపారు. స్పెయిన్‌లో అందమైన ప్రాంతాలైన ఆర్కెంటే, బెనిడోరన్, లమంగా, సెవిల్లా, క్లాడిస్‌బ్రిడ్జ్, వేజర్ వైట్ విలేజ్, టోలోరో, కాంబడాస్‌లలో చిత్రీకరణ జరిపామని తెలిపారు. స్విట్జర్లాండ్‌తోపాటుగా చిక్‌మగళూరు, ఊటీ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించామని, త్వరలో కేరళ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పూర్తవుతుందని ఆయన వివరించారు. వరుణ్‌తేజ్ రేంజ్‌ను పెంచే సినిమాగా రూపొందిస్తున్న ఈ చిత్రం 50 శాతం పూర్తిచేశామని, ఇంకా రెండు పాటలు, క్లైమాక్స్ షూటింగ్ చేయాల్సి వుందని, ఏప్రిల్ 14న విడుదల చేసే అవకాశం ఉందని నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ తెలిపారు. నాజర్, ప్రిన్స్, మురళీశర్మ, తనికెళ్ల భరణి, చంద్రమోహన్, రఘుబాబు, ఆనంద్, పృథ్వి, శ్రీనివాస్‌రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, నాగినీడు హరీష్ ఉత్తమన్, నికితిన్‌దీర్, షఫి, శ్రావణ్, షేకింగ్ శేషు, ఈశ్వరరావు, సురేఖావాణి, సత్యకృష్ణ, తేజశ్వి తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: గోపీమోహన్, మాటలు: శ్రీ్ధర్ శీపాన, పాటలు: రామజోగయ్యశాస్ర్తీ, సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమెరా: కె.వి.గుహన్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనువైట్ల.