ఇప్పట్లో పెళ్లి వద్దు ... అనుష్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుష్క షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పెళ్లివయసు దాటిపోతున్న ఈమెకు పెళ్లిచేయడానికి ఇంట్లోవాళ్లు తెగ ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గ్లామర్ భామగా అనుష్క తెలుగుతెరపై తనదైన ఇమేజ్ తెచ్చుకుంది. ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’ సినిమాలతో స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ ఓ ప్రముఖ నిర్మాతను పెళ్లిచేసుకుంటుందని, ఓ పారిశ్రామికవేత్తను పెళ్లిచేసుకుంటుందని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన అనుష్క- ‘పెళ్లి మనం అనుకున్నప్పుడు జరగదు. సమయం రావాలి.. నాకింకా పెళ్లిఘడియలు రాలేదు.. నా దృష్టి మొత్తం సినిమాలపైనే..’ అని క్లారిటీ ఇచ్చింది.