రాబిన్‌హుడ్‌గా రవితేజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రేజీ హీరోగా టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రవితేజ నటించిన తాజా చిత్రం బెంగాల్ టైగర్‌తో మంచి హిట్‌ను అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన మూడు సినిమాలు చేయడానికి ఓకే చెప్పాడు. ఇప్పటికే దిల్‌రాజు, వేణుశ్రీరామ్‌ల ఎవడోఒకడు, సుధీర్‌వర్మ దర్శకత్వంలో మరో చిత్రం, దాంతోపాటు నూతన దర్శకుడు చక్రి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా గ్లామర్‌భామ అమీజాక్సన్ నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. దీంతోపాటు ఈ చిత్రానికి రాబిన్‌హుడ్ అనే టైటిల్ పెడుతున్నట్టు సమాచారం. ఇటీవలే ఈ ఛాంబర్‌ని రంజిత్ మూవీస్ ఫిలిమ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేశారట. ఇప్పటికే రవితేజ నటించిన కిక్-2 సినిమాలో రాబిన్‌హుడ్ పాత్రలో ఆయన నటించాడు. ఇప్పుడు ఈ సినిమాకు రాబిన్‌హుడ్ టైటిల్ పెడుతుండడంపై అంతటా ఆసక్తి నెలకొంది. త్వరలోనే అధికారికంగా
టైటిల్‌ను వెల్లడిస్తారట.