వచ్చే నెలలో కనుపాప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోహన్‌లాల్, ప్రియదర్శన్ కలయికలో ఆశీర్వాద్ సినిమాస్, వన్ ఓవర్ సీస్ నెట్‌వర్క్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై రూపొందిస్తున్న చిత్రం ‘కనుపాప’. మలయాళంలో విజయవంతమైన ఒప్పమ్ చిత్రాన్ని తెలుగులో దిలీప్‌కుమార్ బొలుగోటి అందిస్తున్నారు. దీన్ని ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధం చేస్తున్న సందర్భంగా నిర్మాత దిలీప్‌కుమార్ మాట్లాడుతూ, మలయాళంలో అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రాన్ని కన్నడంలో శివరాజ్‌కుమార్, హిందీలో అజయ్‌దేవ్‌గన్ రీమేక్ చేస్తున్నారని తెలిపారు. మోహన్‌లాల్ అంధుడిగా నటిస్తున్నారని, లిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న అతని ముందు ఓ హత్య జరిగితే, హంతకుడిని అంధుడైన హీరో ఎలా పట్టుకున్నాడనే కథనంతో చిత్రం సాగుతుందని తెలిపారు. మనమంతా, జనతా గ్యారేజ్ చిత్రాలతో తెలుగులో పాపులర్ అయిన మోహన్‌లాల్, ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తారన్న నమ్మకం వుందని, ఈనెల 25న ఆడియోను విడుదల చేస్తున్నామని అన్నారు. మలయాళంలో కన్నా తెలుగులో పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం వుందని నటుడు మోహన్‌లాల్ తెలిపారు. ఈ చిత్రానికి దర్శకత్వం:ప్రియదర్శన్.