వశిష్టాదేవి పాత్రను మర్చిపోలేను -హీరోయిన్ శ్రీయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాదిలో దాదాపు అన్ని భాషల్లోనూ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ శ్రీయ. టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన శ్రీయ చాలామంది స్టార్ హీరోలతో నటించి క్రేజ్ తెచ్చుకుంది. నందమూరి బాలకృష్ణ సరసన ఆమె నటించిన చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. క్రిష్ దర్శకత్వంలో చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం గురువారం విడుదలవుతున్న సందర్భంగా శ్రీయ చెప్పిన విశేషాలు..
* శాతకర్ణిలో అవకాశం ఎలా..?
- దర్శకుడు క్రిష్ కథ చెప్పగానే బాగా నచ్చింది. వెంటనే ఒప్పేసుకున్నా. ముఖ్యంగా కథలోని ఎమోషన్‌తో పాటు వశిష్టాదేవి పాత్ర నచ్చింది. ఇలాంటి చారిత్రాత్మక సినిమాలో అవకాశం రావడం ఛాలెంజింగ్‌గా అనిపించింది.
* పాత్ర కోసం ప్రిపరేషన్..?
- షూటింగ్ మొదట్లో ఈ పాత్ర చేయగలనా? లేదా? అని కంగారుపడ్డాను కానీ, సెట్‌లోకి వచ్చాక బాలయ్య, క్రిష్‌లు ఇచ్చిన ప్రోత్సాహంతో ధైర్యమొచ్చింది. రెండో రోజునుంచే పాత్రలో లీనమై నటించడం మొదలుపెట్టా. సెట్లోకి వెళ్ళేముందు పాత్రకోసం పెద్దగా ప్రిపేరైంది ఏదీ లేదు. క్రిష్‌ను ఫాలో అయ్యాను అంతే!
* బాలకృష్ణతో ఇన్నాళ్లకు...
- బాలయ్యతో చెన్నకేశవరెడ్డి సినిమా చేసేటప్పుడు నా వయసు 18 అనుకుంటా. అంత చిన్న వయసులోనే ఆయనతో నటించేశా. ఆయన సహ నటీనటులకు మంచి గౌరవం ఇస్తారు. అలాంటి గొప్ప నటుడితో వందో సినిమాలో, పైగా శాతకర్ణి లాంటి స్పెషల్ సినిమాలో చేయడం అదృష్టంగా భావిస్తున్నా. షూటింగ్ సమయంలో బాలయ్య నాకు చాలా సలహాలు ఇచ్చారు.
* దర్శకుడు క్రిష్ గురించి?
- క్రిష్ భిన్నమైన సినిమాలు చేస్తూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. పక్కా ప్లానింగ్ వున్న వ్యక్తి. కథ, పాత్రలపై మంచి పట్టు ఉంది. శాతకర్ణి జీవితకథ క్రిష్ చెప్పడంతో చాలా ఆశ్చర్యమేసింది. ఒకరకంగా నేను హిస్టరీ స్టూడెంట్‌గా మారిపోయాను.
* హేమామాలితో పనిచేయడం?
- నటీనటుల విషయంలో సీనియర్లు, జూనియర్లు అంటూ వుండదు. ఇక్కడ అందరూ సమానమే. అయితే, హేమామాలిని లెజండరీ నటి. ఆమెతో పనిచేయడం మర్చిపోలేని అనుభూతి.
* సినిమాపై నమ్మకం.. ?
- చాలా టెన్షన్‌గా వుంది. మంచి సినిమాతో వస్తున్నాం కాబట్టి ధీమాగానే ఉన్నాం. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది.
* తదుపరి చిత్రాలు..
- ప్రస్తుతం రెండు,మూడు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. వాటి గురించి త్వరలోనే తెలియజేస్తా.

- శ్రీ