కళాత్మక సినిమాలూ చేస్తా ---- హీరో ఎన్టీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్, కమర్షియల్ సినిమాలకే పరిమితం కాదనని, సత్తా ఉన్న కథ ఉంటే క్లాస్ సినిమాలూ చేస్తానంటున్నారు జూనియర్ ఎన్టీఆర్.
నందమూరి బాలకృష్ణతో పోటీ ఏమీ లేదని, మా కుటుంబంలో ఎవరిమధ్యా అలాంటి వాతావరణం ఉండదని, ఎవరి సినిమాలు వారివని ఆయనంటున్నారు.
సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ఈనెల 13న విడుదల కానున్న నేపథ్యంలో ఆయనతో ముఖాముఖి...
గెడ్డం తీశారు, ఎలా వుంది?
చాలా రిలాక్స్‌డ్‌గా వుంది. ఈ సినిమా కోసం దాదాపు ఏడాదిపాటు గెడ్డాన్ని పెంచాల్సి వచ్చింది. దాన్ని మెయిన్‌టెయిన్ చేయడానికి చాలా కష్టం అనిపించింది.
ఈ సినిమా కోసం ఈ గెటప్ ముందుగానే అనుకున్నారా?
ఈ సినిమా చేయడానికన్నాముందు సుకుమార్ నాకు వేరే కథ చెప్పాడు. ఆ కథ బాగా కనెక్ట్ అయింది. అది చేద్దామని ఫిక్స్ అయ్యాను కూడా. కానీ, ఆమధ్య సుకుమార్ తండ్రి అనారోగ్యంతో వున్నపుడు ఈ సినిమా నిర్మాత బాబి సుకుమార్‌ని ఆసుపత్రిలో కలిశాడు. అప్పుడు సుకుమార్ తనకొక ఐడియా వచ్చింది, అది కథగా చేద్దామని చెప్పారట. ఆ కథ విన్న తరువాత బాగా ఫీలయ్యాను. జీవితానికి దగ్గరగా వుండే కథలు అందరినీ త్వరగా కనెక్టు చేస్తాయి.
నాన్నకు ప్రేమతో.. టైటిల్ పెట్టడానికి కారణం?
ఈ సినిమాలో తండ్రీకొడుకుల మధ్య వుండే అనుబంధం నేపథ్యంలో సాగుతుంది. తండ్రికోసం ఒక కొడుకు ఎంతవరకైనా వెళ్లి ఏదైనా చేసేస్తాడు.
ఈ సినిమాలో రెండు పాత్రల్లో కన్పిస్తారట?
లేదండి. ఒకే పాత్ర వుంటుంది. పాత్ర కూడా చాలా భిన్నంగా వుంటుంది. ఒక్కోసారి నాలా నేను కన్పిస్తాను, మరోసారి సుకుమార్‌లా కనిపిస్తాను. ఆయన సినిమాల్లో హీరో పాత్ర కొంచెం భిన్నంగానే వుంటుంది.
సినిమా మొత్తం ఇదే గెటప్‌లో వుంటారా?
అవును. రెగ్యులర్‌గా వుండేకంటే కొంచెం భిన్నంగా కన్పించాలని ఇది ట్రై చేశాను. దాంతోపాటు సినిమా ఎక్కువ భాగం ఫారిన్ బ్యాక్‌డ్రాప్‌లో వుంటుంది కాబట్టి.
ఆడియో ఫంక్షన్‌లో బాగా ఎమోషనై మాట్లాడారు?
ఈ సినిమా క్లైమాక్స్ ముందు చాలా ఎమోషనల్ టచ్‌తో సాగుతుంది. ఆ సీన్ చేసినపుడు రాజేంద్రప్రసాద్‌గారిని పట్టుకొని నిజంగా ఏడ్చేశా. అదే ఎఫెక్టు ఆడియో ఫంక్షన్‌లో ఉంది. ఓ వైపు దేవిశ్రీప్రసాద్ తండ్రి చనిపోవడం, మరోవైపు నాన్నకు ప్రేమతో సినిమా, పక్కనే మా నాన్న వుండడం- ఇవన్నీ ఎమోషన్‌కు గురిచేశాయి.
ఈ సినిమా తరువాత మీలో వచ్చిన మార్పేంటి?
ఈ సినిమా అని కాదు, నాకు అబ్బాయి పుట్టిన తరువాత నాలో చాలా మార్పులు వచ్చాయి. ఈ సినిమాతో ఇంకా ఎక్కువయ్యాయి. నిజానికి నేను అంతకంటే ముందు చాలా హైపర్‌గా వుండేవాడిని. మా అబ్బాయిని చూసిన తరువాత చాలా కూల్‌గా తండ్రీకొడుకుల మధ్య వుండే అనుబంధం నన్ను బాగా మార్చింది.
సుకుమార్ ముందు చెప్పిన కథ కూడా చేస్తారా?
తప్పకుండా. ఆ కథ బాగా నచ్చింది కాబట్టి చేయాలనే నాకూ వుంది. ఎప్పుడు కుదురుతుందో చూద్దాం!
దేవిశ్రీ ప్రసాద్ తండ్రి మరణంతో ఈ సినిమా వాయిదా పడుతుందని తెలిసిన సమయంలో ఎలా ఫీలయ్యారు?
ఈ విషయంలో టీమ్ అందరం చాలా బాధపడ్డాం. సినిమా విషయంలో అందరికీ ప్రశ్నార్థకమే మిగిలింది. దేవిశ్రీ ప్రసాద్ తండ్రి మరణంతో సినిమా వాయిదా పడుతుందనుకున్నాం. కానీ ఆయన మనోధైర్యంతో త్వరలోనే రీరికార్డింగ్ ప్రారంభించి అందరినీ షాక్ అయ్యేలా చేశారు.
జగపతిబాబుతో నటించడం ఎలా వుంది?
జగపతిబాబుతో పనిచేయడం నిజంగా అద్భుతం. జగపతిబాబు సూపర్‌స్టారే. ఇపుడు సినిమాలు తగ్గిపోవచ్చు కానీ ఒకప్పుడు ఆయన శోభన్‌బాబు తరువాత అంతటి పేరు తెచ్చుకున్న గొప్ప నటుడు. ముందు ఈ పాత్ర విన్నపుడు నేను మరీ ఇంత బ్యాడ్‌గా వుంటానా అని ఆయన నాతో అన్నారు. ఇది రియల్ లైఫ్ పాత్ర కాదు, మీరు చేయండి, ఫర్వాలేదని చెప్పాను. మేమిద్దరం టిట్ ఫర్ టాట్ ధోరణితో నటించాం.
మరి ఈ సినిమాతో మీ నాన్నతో మీకున్న రిలేషన్?
ఈ సినిమా చేసేటపుడు చాలాసార్లు నాన్న గుర్తొచ్చారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ చేసిన తరువాత వెంటనే నాన్నతో మాట్లాడాలనిపించింది. ఆ రోజు ఆయన పుట్టినరోజు కావడం కూడా విశేషం. వెంటనే ఫోన్ చేశా.
సుకుమార్‌తో పనిచేయడం?
సుకుమార్‌తో పనిచేయాలని గత ఐదారు సంవత్సరాలుగా ఇద్దరం వెయిట్ చేస్తున్నాం. కానీ ఎందుకో కుదరలేదు. నాకు నచ్చే కథలు ఆయన ఇవ్వకపోవడం వంటి వేరే వేరే కారణాలు వున్నాయి. సుకుమార్ తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకుల్లో ముందుంటారు. ప్రతి పాయింట్‌లో ఆయనకు క్లారిటీ వుంటుంది. సెట్‌లో నటీనటులు ఎలా వుండాలి, ఎలా బిహేవ్ చేయాలి వంటి ప్రతి విషయంపట్ల క్లారిటీ వున్న దర్శకుడు.
మీరు కేవలం హిట్ దర్శకులతో సినిమాలు చేస్తారని వార్తలొస్తున్నాయి. దీని గురించి?
అలాంటిదేమీ లేదు. హిట్ దర్శకులతో పనిచేసినంత మాత్రాన అన్నీ హిట్ సినిమాలే రావు. నేను నమ్మిన కథనే చేస్తాను. అంతేకాని ఏదో కాంబినేషన్ కోసమో సినిమా చేయను. మనం పట్టిందల్లా బంగారమైతే మనుషులు మనుషుల్లా వుండరు కదా! అందుకే దేవుడు అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తుంటాడు.
యాక్షన్‌లో మంచి పేరున్న మీరు రొమాన్స్ విషయంలో ఎలా వుంటారు?
నాకు రొమాన్స్ రాదు. రొమాన్స్ సీన్లనగానే తెలియకుండానే ఏదో అనీజీగా ఫీలవుతా.
మీరు మాస్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తారా?
నాకు మాస్, క్లాసు అనే తేడా తెలియదు. నిజానికి అందరూ ఒక్కటే.
ఒక యాక్షన్ సన్నివేశం చూస్తున్నపుడు ఒక వ్యక్తి బయటికి ఫీలైతే మరో వ్యక్తి లోలోపల ఫీలవుతాడు. అంతమాత్రాన లోలోపల ఫీలైన వ్యక్తి క్లాస్ కాదు కదా!
మీరెక్కువగా కమర్షియల్ సినిమాలపైనే దృష్టి పెట్టారు, నటనకు ఆస్కారమున్న సినిమాలు చేయరా?
అలాంటిదేమీ లేదు. నన్ను కన్విన్స్ చేసే కెపాసిటీ కథలో వుంటే శంకరాభరణం, సాగర సంగమం లాంటి సినిమాలు చేస్తా.
గాసిప్స్ విన్నపుడు ఎలా ఫీలవుతారు?
ఒకప్పుడు గాసిప్స్ విన్నప్పుడు చాలా ఫీలయ్యేవాడిని. కానీ, ప్రస్తుతం సరదాగా తీసుకుంటున్నా.
బాబాయ్‌కి పోటీగా వస్తున్నారు?
ప్రస్తుతం సినిమా విడుదల డేటు చాలా ముఖ్యం. ఒకప్పుడు సంవత్సరం ఆడే సినిమా 175 రోజుల నుండి వంద రోజులు, తరువాత యాభై, ఇప్పుడు రెండు వారాలకొచ్చింది. ఈ రెండు వారాల్లో ఎంత వసూలు చేసిందన్నదే ముఖ్యం. మన తెలుగు పరిశ్రమకు మూడు పండగ సీజనే్ల వున్నాయి. అందులో ముఖ్యమైనది సంక్రాంతి. ఇక బాబాయ్ పోటీ అంటారా, నందమూరి హీరోల్లో అసలు క్లాష్‌లు లేవు. ఎవరి సినిమా స్టామినా వారిదే. నాకు నా సినిమాతోపాటు అందరి సినిమాలు ఆడాలని కోరుకుంటా.
మరి రాజవౌళితో సినిమా ఎప్పుడు?
ఆ విషయం ఆయనే చెప్పాలి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాకుండా హాలీవుడ్‌లో కూడా ఆసియన్ సినిమాకు గుర్తింపుని తీసుకువచ్చాడు. నిజంగా గొప్ప దర్శకుడు.
కొరటాల శివ సినిమా గురించి?
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాకు ‘జనతా గారేజ్’ అనే టైటిల్‌నే ఓకే చేసే ఆలోచనలు వున్నాయి. అన్నీ రిపేరు చేయబడును అనే కాప్షన్‌తో వుంటుంది.
పౌరాణిక సినిమా చేసే ఆలోచనలున్నాయా?
చాలా వున్నాయి. తాతగారిలా ఓ మంచి పౌరాణిక సినిమాలో నటించాలని వుంది. కానీ ఎవరూ ఆ ప్రయత్నం చేస్తారో చూద్దాం!

-శ్రీ