మళ్లీ దండుపాళ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నడంలో రూపొంది తెలుగులో విడుదలైన దండుపాళ్యం సీక్వెల్ రానుంది. వెంకట్ మూవీస్ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో రూపొందించనున్న ఈ చిత్రానికి ‘దండుపాళ్యం-2’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 14న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ మాట్లాడుతూ గతంలో వచ్చిన దండుపాళ్యం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందేనని, రెగ్యులర్‌గా వచ్చే సినిమాలకు డిఫరెంట్‌గా సాగే రియలిస్టిక్‌గా వుండే ఈ చిత్రాన్ని కూడా దండుపాళ్యం లాగే విజయవంతం చేస్తారన్న నమ్మకం వుందన్నారు. వచ్చేనెల 14నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే ఈ చిత్రం సెనే్సషనల్ మూవీ అవుతుందని అన్నారు. నిజంగా జరిగిన కథలా అనిపించే ఈ సినిమా మొదటినుండి చివరి వరకు స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగుతుందని దర్శకుడు శ్రీనివాసరాజు తెలిపారు. ప్రకాష్‌రాజ్, బొమ్మాళి రవిశంకర్, పూజాగాంధీ, మకరంద్ దేశ్‌పాండే, రవికాలే, నవాజుద్దీన్ సిద్ధిక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ప్రసాద్, సంగీతం: అర్జున్‌జన్య, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాసరాజు.