పోలీస్‌గా సందీప్ కిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణవంశీ దర్శకత్వంలో బుట్టబొమ్మ క్రియేషన్స్ పతాకంపై కె.శ్రీనివాసులు, వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘నక్షత్రం’. ఈ చిత్రంలో సందీప్‌కిషన్ పోలీసు అధికారిగా వైవిధ్యమైన పాత్రలో కన్పిస్తారని నిర్మాతలు తెలియజేస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్నామని, వచ్చే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు. పోలీసు అధికారిగా విధులు నిర్వర్తించాలనే ఓ యువకుడి కథతో చిత్రం రూపొందుతోందని తెలిపారు. రామాయణంలో హనుమంతుని పాత్ర ఎంత ప్రాధాన్యత కలిగివుంటుందో సమాజంలో పోలీసు పాత్ర అలా వుంటుందన్నారు. కథానాయకుడు విధి నిర్వహణలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడనే కథనాన్ని వెండితెరపై సరికొత్తగా చర్చిస్తున్నామని వారు తెలిపారు. సాయిధరమ్ తేజ్, రెజీనా, ప్రగ్యాజైస్వాల్, తులసి, జె.డి.చక్రవర్తి, ప్రకాష్‌రాజ్, శివాజీరాజా, రఘుబాబు, తనీష్, ముక్తార్‌ఖాన్, సాయికిరణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు:తోట ప్రసాద్, పద్మశ్రీ, కిరణ్ తటవర్తి, పాటలు:అనంత్ శ్రీరామ్, కెమెరా:శ్రీకాంత్ నారోజ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:కృష్ణవంశి.