‘సందేశాత్మక చిత్రాలు నిర్మిస్తా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తేనెటీగ’, ‘గజబలుడు’, ‘గెలుపుగుర్రాలు’ చిత్రాలు రూపొందించిన నిర్మాత సి.ఆర్.రాజన్ ఇకముందు ప్రజలకు సందేశం ఇచ్చే చిత్రాలను నిర్మిస్తామంటున్నారు. జన్మదినోత్సవ సందర్భంగా పలు నిర్ణయాలను తీసుకున్న తాను ఇకనుండి మంచి చిత్రాలను రూపొందిస్తానని అంటున్నారు.
సినిమా పరిశ్రమపై మక్కువతో పలు చిత్రాలను తాను రూపొందించానని, రియల్ ఎస్టేట్ నుండి దొరికిన పరిచయాలతో సినిమా మిత్రులు దొరికారని, అలా సినీ రంగంలో అడుగుపెట్టిన తాను మంచి చిత్రాలను అంతర్లీనంగా సందేశం ఇచ్చే కమర్షియల్ ఫార్మాట్‌లో రూపొందించడానికి ఈ సంవత్సరం నుండి వరుసగా తమ సంస్థనుండి సినిమాలు తీయడానికి నిర్ణయించుకున్నామని, ప్రస్తుతం ‘సూర్యం’ అనే టైటిల్‌తో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని జూలైలో ప్రారంభించనున్నామని, తెలుగు తమిళ భాషల్లో రూపొందించే ఈ చిత్రం గూర్చి మిగతా వివరాలు త్వరలో ప్రకటిస్తామని ఆయన అన్నారు.