‘జల్లికట్టు’కు మద్దతుగా తమిళ సినీ పరిశ్రమ బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జల్లికట్టు’ క్రీడపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ తమిళనాడులో జరుగుతున్న ఆందోళనకు ఆ రాష్ట్రంలోని సినీ పరిశ్రమ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ‘జల్లికట్టు’పై ఆంక్షలు సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక ఆర్డినెన్స్‌ను విడుదల చేయాలని తమిళ సినీ ప్రముఖులు డిమాండ్ చేశారు. రాష్టవ్య్రాప్తంగా జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా గురువారం నాడు సినిమా షూటింగ్‌లను పూర్తిగా నిలిపివేశారు. ఏటా సంక్రాంతి సీజన్‌లో నిర్వహించే సంప్రదాయ క్రీడ ‘జల్లికట్టు’ను నిషేధించడమంటే తమిళుల మనోభావాలను దెబ్బతీయడమేనని రజనీకాంత్, కమల్‌హాసన్, అజిత్, సూర్య, విశాల్, శరత్‌కుమార్, విజయ్, శింబు, ప్రభుదేవా, రాఘవ లారెన్స్, నయనతార, త్రిష వంటి సినీ ప్రముఖులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. ‘జల్లికట్టు’ను అనుమతించాలని కోరుతూ గురువారం చెన్నైలోని మెరీనా బీచ్‌లో యువత చేపట్టిన నిరవధిక ఆందోళన కార్యక్రమానికి సూర్య, రాఘవ లారెన్స్ వంటి సినీ ప్రముఖులు హాజరై సంఘీభావం ప్రకటించారు.
తమిళ సినీ పరిశ్రమకు చెందిన డైరెక్టర్ల సంఘం, దక్షిణ భారత సినీ ఉద్యోగుల సమాఖ్య, సినీ కార్మికుల సంఘం, నిర్మాతల మండలి ‘జల్లికట్టు’ పోరాటానికి మద్దతు ప్రకటించాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం నుంచి షూటింగ్‌లు నిలిపివేయగా, గురువారం సినీ పరిశ్రమ పూర్తిస్థాయిలో బంద్ పాటించింది. తమిళ నటీనటులకు ప్రాతినిధ్యం వహించే ‘నడిగర్ సంఘం’ మద్దతు ప్రకటించడంతో చిత్ర పరిశ్రమకు సంబంధించిన కార్యకలాపాలన్నీ స్తంభించాయి. ఇంతకుముందు ‘జల్లికట్టు’ను వ్యతిరేకించిన నటీనటులు సైతం ఇపుడు జనంలోకి వచ్చి మద్దతు ప్రకటిస్తున్నారు. ఎద్దులు హింసకు గురవుతున్నందున ‘జల్లికట్టు’ను నిలిపివేయాలంటూ గతంలో మాట్లాడిన సినీ ప్రముఖులు జనం ఆగ్రహానికి గురవడంతో ఇపుడు మాట మార్చారు. ఇలాగే జనం ఆగ్రహానికి గురైన ‘నడిగర్ సంఘం’ నేత, యువహీరో విశాల్ ఇపుడు- జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలంటూ ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేసేందుకు గురువారం దిల్లీ వెళ్లారు. తన ‘ట్విట్టర్’ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని, జల్లికట్టుకు వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని నటి త్రిష వివరణ ఇచ్చారు. జంతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నామంటున్న ‘పెటా’ సంస్థ నిజానికి తమిళ సంస్కృతికి వ్యతిరేకంగా పనిచేస్తోందని, ఆ సంస్థను తక్షణమే రద్దు చేయాలని మరికొందరు నటీనటులు డిమాండ్ చేశారు.
జల్లికట్టుకు వ్యతిరేకంగా మాట్లాడిన నటీనటులపై మరోవైపుఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక వెబ్‌సైట్లలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవహింస వద్దన్న ప్రముఖ నటి త్రిషపై సోషల్ మీడియాలో ఇప్పటికే కొంతమంది అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. చెన్నైతో పాటు రాష్టవ్య్రాప్తంగా యువత ఆందోళన చేస్తున్నందున సినీ ప్రముఖులు ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆడియో లాంచ్‌లు, ముహూర్తపు షాట్‌లు, షూటింగ్‌లకు నటీనటులు, సాంకేతిక నిపుణులు దూరంగా ఉంటున్నారు. నటీనటులపై యువత నిఘా పెట్టడంతో కొన్ని చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి.

సంప్రదాయాన్ని కాదంటారా?
‘జల్లికట్టు’లో ఎద్దులు కాని, పాల్గొనేవారు కాని గాయాల పాలు కాకుండా తగు చర్యలు తీసుకోవాలే తప్ప, ఈ క్రీడను నిషేధించడమంటే సంస్కృతి, సంప్రదాయాలను అడ్డుకోవడమేనని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొన్ని నిబంధనలను, పరిమితులను విధించాలని ఆయన సూచించారు.

బిర్యానీని బ్యాన్ చేయండి..
వేల సంవత్సరాల నుంచి తమిళనాడులో సంప్రదాయబద్ధంగా వస్తున్న ‘జల్లికట్టు’ను నిషేధించడం సరికాదని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ అన్నారు. స్పెయిన్‌లో జరిగే ‘బుల్‌ఫైట్’కు, ఇక్కడి ‘జల్లికట్టు’కు ఉన్న తేడాను జంతుప్రేమికులు గుర్తించాలన్నారు. ‘జల్లికట్టు’ క్రీడలో జంతుహింస ఉంటే- మాంసాహారులు తినే బిర్యానీని కూడా నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు.

నేడు రెహమాన్ నిరాహార దీక్ష
జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ తమిళనాడులో యువత చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళ ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తూ శుక్రవారం నిరాహార దీక్ష చేస్తానని ఆయన స్పష్టం చేశారు. రెహమాన్ నిర్ణయం తమిళనాడులో పెను సంచలనం సృష్టించింది.

సంప్రదాయ సాహస క్రీడ
‘ఏటా పొంగల్ పండుగ సందర్భంగా తమిళులు నిర్వహించే జల్లికట్టు క్రీడకు నేను వ్యతిరేకిని కాను. జల్లికట్టుపై నిషేధం విధించాలని నేను ఎప్పుడూ మాట్లాడలేదు. నా ‘ట్విట్టర్’ను ఎవరో హ్యాక్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలను ‘పోస్ట్’ చేశారు. తమిళులకు ఓ గుర్తింపు తెచ్చిన ‘జల్లికట్టు’ నిజానికి ఓ సంప్రదాయ సాహస క్రీడ. తమిళుల సంస్కృతి, సంప్రదాయాలు కొనసాగాలి.’