క్రేజీ రక్షకభటుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రిచా పనయ్, ప్రభాకర్, బ్రహ్మానందం, కాట్రాజు, బ్రహ్మాజి ప్రధాన తారాగణంగా సుఖీభవ మూవీస్ పతాకంపై వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో గురురాజ్ రూపొందిస్తున్న చిత్రం ‘రక్షక భటుడు’. ఈ చిత్రానికి సంబంధించిన 60 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, మంచి కథాంశంతో క్రేజీగా రూపొందిస్తున్న ఈ సినిమా తన గత చిత్రాలకు భిన్నంగా వుంటుందని తెలిపారు. కథే వెరైటీగా వుండడంతో పేరును కూడా అలాగే పెట్టామని, ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించిందని, ఆంజనేయస్వామి ముఖంతో వున్న పోలీసు అధికారి ఎవరో చెప్పమంటూ అనేకమంది ఫోన్లుచేశారని ఆయన అన్నారు. సబ్జెక్టు వినగానే నచ్చి ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చానని, పరిశ్రమలోని ప్రధాన తారలంతా ఇందులో నటిస్తున్నారని నిర్మాత గురురాజ్ అన్నారు. ఈ నెల ప్రథమార్థంలో జరిపిన షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించామని, ఫిబ్రవరిలో జరిగే షెడ్యూల్‌తో సినిమా పూర్తిచేస్తామని అన్నారు. రఘు, చిత్రం శ్రీను, సత్తెన్న, జ్యోతి, కృష్ణేశ్వరరావు, మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:మల్హర్‌భట్ జోషి, సంగీతం:దినేష్, ఎడిటింగ్:అమర్‌రెడ్డి, నిర్మాత:గురురాజ్, రచన, దర్శకత్వం:వంశీకృష్ణ ఆకెళ్ల.