జీవితంలో ఒక్కసారే.. సౌరబ్ జైన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎంతో అనుభవమున్న దర్శకుడు కె.రాఘవేంద్రరావు, హీరో నాగార్జునలతో కలిసి గొప్ప చిత్రంలో నటించే అవకాశం రావడం జీవితంలో ఒక్కసారే వచ్చే అదృష్టం. వారితో పనిచేయడం మరపులేని అనుభూతినిచ్చింది. నాగార్జున నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. దర్శకుడు రాఘవేంద్రరావు ఈ వయసులో కూడా అలుపన్నది లేకుండా పనిచేస్తూ ఏ సీన్ ఎవరు ఎలా చేయాలో అనేది చక్కగా రాబట్టుకుంటారు’ - అని నటుడు సౌరబ్ జైన్ తెలిపారు. అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి వంటి చిత్రాల తరువాత అక్కినేని నాగార్జున-కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో సాయికృప ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి రూపొందిస్తున్న భక్తిరస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. ఈ చిత్రంలో సౌరబ్ జైన్ వెంకటేశ్వరస్వామిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాత్రికేయులతో చిత్ర విశేషాలను పంచుకున్నారు.
అలా వచ్చా
మా అమ్మ లాయర్. భార్య సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. నాన్న వ్యాపారం చేస్తారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన నేను కంప్యూటర్ సైన్స్‌లోగ్రాడ్యుయేషన్, ఎంబిఎ చేసి మోడలింగ్ వైపు వచ్చి అటునుంచి టీవీ రంగం వైపు వచ్చాను. ఆ తరువాత సినిమా అవకాశాలు వచ్చాయి.
తెలుగులో అవకాశం
ఓం నమో వెంకటేశాయ తెలుగులో నేను నటిస్తున్న మొదటి చిత్రం. అంతకుముందే ఓ ఇరానీ సినిమాలో నటించాను. హిందీ టీవీ సీరియల్‌గా వచ్చిన మహాభారత్‌లో కృష్ణుడిగా నటించాను. అది చూసిన రచయిత భారవి రాఘవేంద్రరావుకు చెప్పడంతో ఈ సినిమాలో నటించమని అడిగారు. అలా టాలీవుడ్‌లోకి వచ్చా.
అన్నీ ఆయనే
ఈ సినిమాలో వెంకటేశ్వరస్వామిగా న్యాయం చేయలేనేమోనని మొదట భయపడ్డాను. అయితే దర్శకుడు రాఘవేంద్రరావు అన్ని విషయాలు తానే చూసుకుంటానని భరోసా ఇవ్వడంతో ముందుకు వచ్చాను. ఆయన చెప్పినట్లుగా నా పాత్రకు సంబంధించిన అన్ని విషయాలను ఆయనే చూసుకున్నారు. తెలుగు, ఇంగ్లీష్ తెలిసిన ఓ ట్యూటర్‌ను కూడా పెట్టి డైలాగులు ప్రాక్టీసు చేయించారు. ఈ సినిమా కోసం నేను డబ్బింగ్‌పై ఆధారపడలేదు. ఇప్పటికే నేను కృష్ణుడిగా నటించి ఉండడం వల్ల దర్శకుడు చెప్పగానే వెంకటేశ్వరస్వామిపై ఓ అవగాహన వచ్చింది. సెట్స్‌లోకి రాగానే ఆయన చెప్పినట్టే చేసుకుంటూ వెళ్లిపోయాను. అంతే..
పెద్ద దర్శకుడితో
రాఘవేంద్రరావుతో కలిసి పనిచేయడం మర్చిపోలేని అనుభూతి. ఏ పాత్ర ఎలా వౌల్డ్ చేయాలో ఆయనకు తెలిసినట్లుగా మరెవరికీ తెలియదేమో. ఈ పాత్రను నేను కూడా ఓ సవాల్‌గా తీసుకొని నటించా.
నాగార్జునతో
నాగార్జునతో కలిసి పనిచేయడం ఓ తియ్యని అనుభూతి. నటుడిగానే కాక వ్యక్తిగా ఎలా వుండాలో ఆయన్నుండి నేర్చుకోవచ్చు. పెద్ద స్టారైనా చాలా నిగర్విగా ఉంటారు. ఆయనతో కలిసి పనిచేయడం ఓ ఆశీర్వాదంలా భావిస్తాను. మంచి లెజెండ్స్‌తో ఈ సినిమాలో నటించినందుకు గర్విస్తున్నా.
టాలీవుడ్ నచ్చింది
తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంచి వాతావరణం కనబడుతోంది. యూనిట్‌లో అందరూ సపోర్టు చేస్తూ నన్ను చాలా కంఫర్ట్‌బుల్‌గా ఉంచారు. ఇక్కడ వర్క్ డెడికేషన్ ఎక్కువ.
మంచి ప్రాతలైతే ఓకే
ఓం నమో వెంకటేశాయ విడుదలకు సిద్ధంగా ఉంది. కొత్త సినిమాలు ఏవీ ఒప్పుకోలేదు. మంచి పాత్రలు దొరికితే మాత్రం తప్పక చేస్తాను.

-యు