శ్రీవల్లీ గీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రజత్, నేహాహింగే జంటగా రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రాజ్‌కుమార్ బృందావనం, సునీత సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం శ్రీవల్లీ. ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు ఎస్.ఎస్.రాజవౌళి ఆడియో సీడీని విడుదల చేశారు. థియేటర్ ట్రైలర్‌ను దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్.ఎస్.రాజవౌళి మాట్లాడుతూ, తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ని చూసి గర్వపడిన క్షణాలు తనకు చాలా వున్నాయని, బాహుబలి, భజరంగీ భాయిజాన్ ఘన విజయం సాధించడం చూసి గర్వపడతానని తెలిపారు. ఇప్పటివరకు సినీ చరిత్రలో రాని కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం వైవిధ్యంగా వుంటుందని, మనసు లోతుల్లోకి చూడగలిగితే ఏం జరుగుతుందనే అంశంతో ఈ సినిమా రూపొందించామని దర్శకుడు విజయేంద్రప్రసాద్ తెలిపారు. ‘ఓ అమ్మాయి మనసుపై ఓ శాస్తవ్రేత్త చేసిన ప్రయోగం ఆమె జీవితాన్ని ఎలాంటి ఇబ్బందుల్లో పడేసింది, ఆ ప్రయోగం కారణంగా అస్తవ్యస్తమైన ఆమె జీవితాన్ని తిరిగి ఎలా చక్కదిద్దుకున్నది’ అన్న అంశంతో చిత్రం రూపొందిందన్నారు. ఈ సినిమా మహిళల శక్తి సామర్థ్యాలను చాటి చెబుతుందని నిర్మాత తెలిపారు. మూసధోరణిలో సాగే తన ఆలోచనను మార్చి మంచి దారిలో సాగేలా రాజవౌళి నడిపించారని సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ అన్నారు.