ఎస్-3 విడుదల వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్య, శ్రుతి హాసన్, అనుష్క నటించిన చిత్రం ఎస్3 (యముడు-3’. ఈ చిత్రానికి హరి దర్శకుడు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా సగర్వంగా సమర్పిస్తూ తెలుగులో సుర ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మల్కాపురం శివకుమార్ నిర్మించారు. హారీస్ జైరాజ్ సంగీతం అందించారు. జనవరి 26న విడుదల కావలసిన ఈ చిత్రం తమిళనాట నెలకొన్న పరిస్థితుల కారణంగా విడుదలను వాయిదా వేస్తున్నారు. నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ- తమిళ, తెలుగు భాషల్లో ఈనెల 26న విడుదల కావలసిన ఎస్-3 విడుదల వాయిదా వేశాము. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంగా విడుదల చేయడానికి ప్లాన్ చేసిన ఈ చిత్రం ప్రస్తుతం జల్లికట్టు నేపథ్యంలో తమిళనాట కొనసాగుతున్న పరిస్థితుల్ని గమనించి, ఇది విడుదలకి సరియైన సమయం కాదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాం. డైరెక్టర్ హరి, సూర్య కాంబినేషన్‌లో వచ్చే ఈ చిత్రం కోసం తమిళ, తెలుగు ప్రేక్షకులు ఏ విధంగా ఎదురుచూస్తుంటారో అందరికీ తెలుసు. పలు కారణాలతో ఈ చిత్రం విడుదలను ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వస్తున్నాం. రెండు రాష్ట్రాల్లో అన్ని పరిస్థితులు అనుకూలంగా వున్న సమయంలో విడుదల చేస్తాం.’ అన్నారు.