శాతకర్ణితో మంచి గుర్తింపు -సునీల్‌కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఈ సంక్రాంతికి నేను నటించిన రెండు చిత్రాలు విడుదలై మంచి విజయాలను సాధించాయి. నటుడుగా నాకు మంచి పేరును తెచ్చాయ’ని అంటున్నాడు నటుడు సునీల్‌కుమార్. గౌతమిపుత్ర శాతకర్ణి బౌద్ధ సన్యాసి ధర్మనందనుడుగా, హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య చిత్రంలో విలన్ క్యారెక్టర్‌లో నటించిన సునీల్‌కుమార్ మంగళవారం మీడియాతో ముచ్చటించాడు. ‘నేను మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో పుట్టి పెరిగాను. నా చదువులో ఎక్కువ భాగంలో అక్కడే కొనసాగింది. మా నాన్నకు హోటల్ బిజినెస్ వుంది. నటుడిగా రాణించాలనే కోరిక నాలో బలంగా ఏర్పడింది. అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుండేవాడిని. ఫొటోలు తీసుకుని చాలా సినిమా ఆఫీసులకు వెళుతూ వస్తుండేవాడిని. ఓసారి టాలీవుడ్ సీనియర్ దర్శకుడు బాపుగారు నా ఫోటోలను చూసి, ఆయన చేస్తున్న భాగవతంలో నన్ను రాముడు, కృష్ణుడు పాత్రల కోసం ఎంపిక చేశారు. తర్వాత రాధాగోపాలం, సుందరకాండ సినిమాల్లో కూడా నటించాను. ఆ తర్వాత యాక్సిడెంట్ కారణంగా సినిమాల్లో నటించలేకపోయాను. చాలాకాలానికి మళ్లీ మేకప్ వేసుకుని, గౌతమిపుత్ర శాతకర్ణి, కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేశాను. రెండు పాత్రలకు నాకు మంచి పేరు వచ్చింది. శాతకర్ణి సినిమాలో ధర్మనందనుడు పాత్ర కోసం మేకప్ కుదరక పోవడంతో ‘గుండు కొట్టించుకుంటావా?’ అని దర్శకుడు క్రిష్ అడిగారు. నేను వెంటనే గుండు కొట్టేంచేశాను. ఇప్పుడు సినిమాలో నా పాత్ర చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. హేమామాలిని, బాలకృష్ణతో కలిసి నటించడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. చాలా మంచి పాత్రలు చేయాలని ఎదురుచూస్తున్నాను’ అన్నారు.