పులోమావిగా మోక్షజ్ఞ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. ఎప్పటి నుంచో మోక్షజ్ఞ కోసం ఓ జానపద కథను అనే్వషిస్తున్న సంగతి తెలిసిందే. గౌతమిపుత్ర శాతకర్ణి హిట్ అయిన నేపథ్యంలో శాతకర్ణి కుమారుడు పులోమావి కథను తెరపై ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రంలో పులోమావిగా మోక్షజ్ఞ నటిస్తారట. శాతకర్ణి సినిమా అంతా యుద్ధ నేపథ్యంలో వున్నది కనుక పులోమావి కథను ప్రేమాయణం నేపథ్యంలో చిత్రీకరిస్తాని భోగట్టా. ఇప్పటికే ఓ చారిత్రక నవలా రచయిత రచించిన శ్రావణి నవలను ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘శ్రావణి’ అనే పెట్టనున్నారట. గౌతమిపుత్ర శాతకర్ణిని చిత్రీకరించిన క్రిష్షే ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యత వహిస్తాడని వినిపిస్తున్న కథనం.