పోలీస్ పవర్ ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వేశ్వర మూవీస్ పతాకంపై జొన్నలగడ్డ శివ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం ‘పోలీస్ పవర్’. గుద్దేటి బసవప్ప మేరు ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమాకు సంబంధించిన ఆడియో సీడీని హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో గోపీనాథ్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- సినిమా పేరు ఎంత పవర్‌ఫుల్‌గా వుందో ట్రైలర్ కూడా అంత పవర్‌ఫుల్‌గా వుందని, బి, సి సెంటర్లలో బాగా ఆడుతుందని, తమిళంలో కూడా విడుదల చేస్తే మంచి పేరు వస్తుందని తెలిపారు. కాల్‌మనీ నేపథ్యంలో యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించామని, ‘పోలీస్ పవర్ ఏంటో చూపించండి’ అన్న పాట అందరికీ నచ్చుతుందని హీరో, దర్శకుడు జొన్నలగడ్డ శివ తెలిపారు. ఈనెల 1న టీజర్‌ను విడుదల చేయగా మంచి ఆదరణ లభిస్తోందని, ఏడు ఫైట్లు, ఆరు పాటలతో రూపొందించిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని, త్వరలో విడుదల చేస్తామని నిర్మాత బసవప్ప మేరు అన్నారు. కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్, సారిపల్లి కొండలరావు తదితరులు చిత్ర విశేషాలు తెలిపారు.