గ్లామర్ డోస్ పెంచుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాల్లో ఏది ఉన్నా లేకపోయినా గ్లామర్ తప్పనిసరి అన్న విషయం ఏ హీరోయిన్‌ను అడిగినా చెబుతారు. గ్లామర్ ఉంటే ఆమెదే హంగామా.. లేదు నేను ఇలానే నటిస్తాను, ఇలాంటి పాత్రలే చేస్తాననని మడికట్టుకుని కూర్చుంటే మూటాముల్లె సర్దుకుని ఇంటికి వెళ్లాల్సిందే. ఈ విషయాన్ని కాస్త లేట్‌గా తెలుసుకున్నట్టుంది ఈ హాట్ భామ. అందుకే కాస్త గ్లామర్ డోస్ పెంచేందుకు సిద్ధమైన ఆ భామ ఎవరో కాదు సోనాక్షి సిన్హాయే. సల్మాన్ హీరోగా వచ్చిన దబాంగ్ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిన సోనాక్షికి ఆ తరువాత వరుస అవకాశాలు క్యూ కట్టాయి. దాంతో టాప్ హీరోయిన్ల సరసన చేరింది. గ్లామర్‌కు దూరంగా వున్న ఈ అమ్మడికి ఈమధ్య పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు మాత్రం రావడం లేదు. చేసిన రెండు సినిమాలు ఢమాల్ మనడంతో చేతిలో అవకాశాలు లేకుండా పోయాయి. మళ్లీ అవకాశాలు పట్టేయాలంటే గ్లామర్ మంత్రం జపించాల్సిందే అని తెలుసుకున్నట్టుంది. అందుకే హాట్ హాట్‌గా ఫొటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. ‘నేను గ్లామర్ డోస్ పెంచాను బాబోయ్..’ అంటూ చెబుతున్నట్టే ఉంది. మరి ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కడతాయో లేదో చూడాలి.