విలన్‌గా విశాల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ, తెలుగు పరిశ్రమల్లో స్టార్ హీరోగా మంచి మార్కెట్‌ను సంపాదించుకున్న హీరో విశాల్ త్వరలో మలయాళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అది కూడా మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రంతో కావడం విశేషం. ఈ విషయాన్ని స్వయం మోహన్‌లాల్ తన ఫేస్‌బుక్ ద్వారా తెలుపుతూ- ‘త్వరలో నేను చేయబోయే చిత్రంలో తమిళ హీరో విశాల్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడు’ అని పేర్కొన్నారు. విశాల్‌కు లభించేది ప్రతినాయకుడి పాత్రే అని బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు ఉన్నికృష్ణన్ కూడా ‘విశాల్ చా లా ముఖ్యమైన పాత్ర చేస్తున్నాడు. అది కథకు ఎంతో కీలకమైన పాత్ర’అంటూ ట్విట్టర్‌లో తెలిపాడు. ఈ చిత్రాన్ని లింగ, భజరంగీ భాయిజాన్ వంటి భారీ సినిమాల్ని నిర్మించిన నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. త్వరలోనే అధికారిక వివరాలు ప్రకటిస్తారట.