శ్రీయ మళ్లీ బిజీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న హాట్ భామ శ్రీయకు ఈమధ్య కెరీర్ బాగా వెనక్కివెళ్లింది. గ్లామర్ డోస్ పెంచుతూ చేసిన సినిమాలు కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతో సినిమా ఛాన్సులు కూడా రావడం లేదు. తాజాగా బాలకృష్ణ సరసన గౌతమిపుత్ర శాతకర్ణిలో వశిష్టాదేవిగా నటించి ఆకట్టుకున్న ఈ అమ్మడు మళ్లీ టాలీవుడ్‌పై ఫోకస్ పెట్టినట్టుంది. అందుకే ఈ సినిమా తరువాత గ్లామర్ లుక్‌లో ఫొటో షూట్ ఇచ్చింది. కొత్తలుక్‌లో హీటెక్కిస్తున్న శ్రీయ ఫొటోలు చూస్తుంటే మళ్లీ ఆమె టాలీవుడ్‌లో బిజీ అవ్వడం ఖాయం అని అనిపిస్తుంది. ‘శాతకర్ణి’ విజయంతో కొత్త ఉత్సాహం నింపుకున్న ఆమె మళ్లీ బిజీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.