ఆ కథే ఫైనల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రం బాక్సాఫీసువద్ద దూసుకుపోతూ వంద కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ దక్కించుకున్న చిరంజీవి తన తదుపరి చిత్రానికి అప్పుడే సన్నాహాల్లో స్పీడ్ పెంచారు. ఆయన 151వ చిత్రంగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పరుచూరి బ్రదర్స్ నేతృత్వంలో ఈ సినిమాకు సంబంధించిన కథపై కసరత్తులు జరుగుతున్నాయని తెలిసింది. ఈ చిత్రానికి ఇటీవలే ‘్ధృవ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇప్పటికే సురేందర్ రెడ్డి స్టయిల్‌లో కథలో మార్పులు, చేర్పులు చేస్తున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ నిర్మిస్తాడని త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి, మార్చిలో చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.