ముస్తాబైన వైశాఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయ బి. దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్న ‘వైశాఖం’ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో ప్రస్తుతం ఎడిటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. దర్శకురాలు జయ బి. మాట్లాడుతూ, ‘కుటుంబ సభ్యులంతా కలిసి చూసి ఎంజాయ్ చేసే మంచి సినిమాగా ‘వైశాఖం’ రూపొందుతోంది. లవ్‌లీ తర్వాత మళ్ళీ సిట్ సినిమా ఇవ్వాలన్న లక్ష్యంతో మంచి కథాంశంతో రూపొందిస్తున్న సినిమా ఇది. ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్ మిక్స్ అయిన ‘వైశాఖం’ అపార్ట్‌మెంట్స్ నేపథ్యంలో సాగుతుంది. డైరెక్టర్‌గా నాకు మంచి పేరు తెచ్చే సినిమా ఇది. కమర్షియల్‌గా పెద్దహిట్ రేంజ్‌కి వెళ్తుంది. కజకిస్తాన్‌లో తీసిన సాంగ్స్ ఈ చిత్రానికి హైలైట్ అవుతాయి’ అన్నారు. నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ, ఇది చిన్న చిత్రం అయినా భారీ బడ్జెట్‌లో నిర్మిస్తున్నాం. హై టెక్నికల్ వేల్యూస్‌తో తీస్తున్న ‘వైశాఖం’ మా బేనర్‌లో వచ్చిన ‘లవ్‌లీ’కి రెట్టింపు విజయాన్ని అందిస్తుందన్న కాన్ఫిడెన్స్ వుంది. ఈ చిత్రానికి ఓవర్సీస్ నుండి కూడా బిజినెస్ పరంగా మంచి ఆఫర్స్ రావడం హ్యాపీగా ఉంది. హిందీ, తమిళ రైట్స్ కోసం కూడా ఆఫర్స్ రావడం ఈ సినిమా మీద ఉన్న క్రేజ్‌కి నిదర్శనం అన్నారు. హరీష్, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.