సెన్సార్ బోర్డు తీరు సరికాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీన్ సంజయ్, తనిష్క్ తివారి ప్రధాన తారాగణంగా బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై ప్రేమ్‌రాజ్ దర్శకత్వంలో బొమ్మకు మురళి రూపొందించిన చిత్రం ‘శరణం గచ్ఛామి’. ఈ చిత్రాన్ని సెన్సార్‌కు పంపించగా, అసభ్యత, అశ్లీలతకు పెద్దపీట వేస్తూ హింసను ప్రేరేపిస్తూ, యువతను పెడదారి పట్టించేలా ఈ చిత్రం రూపొందించారన్న అభియోగంపై సెన్సార్ బోర్డు వారు సర్ట్ఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. ఈ నేపథ్యంలో దర్శక, నిర్మాతలు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ- తమ చిత్రంలో యువతను మేలుకొలిపేలా, మేధావులను సైతం ఆలోచించేలా క్లీన్ ఎంటర్‌టైనర్‌గా నిబద్ధతతో, నిజాయితీతో రూపొందించామని, సినిమా విడుదలకు కొందరు మోకాలడ్డుతుండడం తమకు ఆశ్చర్యాన్ని, ఆవేదనను కలిగిస్తోందని తెలిపారు. సహేతుకమైన కారణాలు చూపకుండా రివైజింగ్ కమిటీకి వెళ్లమనడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, సెన్సార్ బోర్డు పక్షపాత ధోరణిని ప్రజల ముందుకు తీసుకువెళ్లడానికి ముందుకు వచ్చామని వారు తెలిపారు. తమ వాదనలో నిజం వుందని, తమకు జరుగుతున్నది కచ్చితంగా అన్యాయమేనని భావించేలా అందరికీ తెలియజేస్తామన్నారు.