ప్రభుదేవాతో మరోసారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు అయిన ప్రభుదేవా వరుస సినిమాలకు సైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభుదేవా నూతన దర్శకుడు అర్జున్‌తో కలిసి ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ప్లాన్ చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. ప్రభుదేవా మరో కొత్త సినిమాకి కూడా రెడీ అయ్యారట. తమిళ దర్శకుడు శీను రామస్వామి కొన్నాళ్ల క్రితం ప్రభుదేవా కోసం ఓ కథను సిద్ధం చేశాడు. ఇప్పుడు ఆ కథే సినిమాగా రూపుదిద్దుకోనుంది. దర్శకుడు శీను రామస్వామి ఈ చిత్రంలో హీరోయిన్‌గా తమన్నాను తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. ఆమెకు స్క్రిప్ట్ కూడా వినిపించాడట. కథ విన్న తమన్నా సానుకూలంగానే స్పందించినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఒప్పుకోలేదని, ఆమె ఒప్పుకోగానే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేస్తుందని తమిళ సినీ వర్గాల సమాచారం. గతంలో శీను రామస్వామి తమన్నా-విజయ్ సేతుపతి జంటగా ‘్ధరమధురై’ చిత్రాన్ని రూపొందించాడు. ఆ చిత్రం తమన్నాకు మంచి పేరును తెచ్చిపెట్టింది. కనుక తమన్నా ఈ ప్రాజెక్టును అంగీకరించే అవకాశం ఉంది.