24న విన్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిధరమ్ తేజ్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు నిర్మిస్తున్న చిత్రం ‘విన్నర్’. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఇటీవలే హీరో మహేష్‌బాబు ఓ పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ, ‘జన్మనిచ్చిన తండ్రిని, మనసిచ్చిన అమ్మాయిని గెలవడం కోసం ఓ యువకుడు చేసిన పోరాటమే ఈ చిత్రం కథకు సరైన టైటిల్. ఫస్ట్‌లుక్‌తో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సితారా సితారా.. అంటూ సాగే పాటను మహేష్‌బాబు విడుదల చేశారు. తమన్ అందించిన సంగీతానికి మంచి స్పందన వచ్చింది’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ, ‘మిగిలిన పాటలను ఈనెల 12 నుండి చిత్రీకరిస్తాం. ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుగుతోంది. 19న ఆడియో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నాం. ఒక్కో పాటను ఒక్కో ప్రముఖుడితో విడుదల చేయిస్తున్నాం. మహాశివరాత్రి సందర్భంగా 24న చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:చోటా కె నాయుడు, సంగీతం:తమన్, ఎడిటింగ్:ప్రవీణ్ పూడి, ఆర్ట్:ప్రకాష్, కథ:వెలిగొండ శ్రీనివాస్, రచన:అబ్బూరి రవి, శ్రీ్ధర్ శీపాన, నిర్మాతలు:నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:గోపీచంద్ మలినేని.