ప్రేమాయణంలో సోనమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ సోనమ్‌కపూర్‌కు ఈమధ్య బాలీవుడ్‌లో పెద్దగా కలిసిరావడం లేదు. గ్లామర్‌తో ఎన్నిరకాల ప్రయోగాలు చేసినా అవకాశాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. గత ఏడాది నీర్జా సినిమాతో మంచి మార్కులే కొట్టేసినా పెద్దగా అవకాశాలు మాత్రం అందిపుచ్చుకోలేక పోయింది. హాట్ హాట్‌గా గ్లామర్ హంగులతో ఫొటోషూట్లు ఇస్తూ అవకాశాల కోసం ప్రయత్నాలు చేసినా పరిస్థితి మారలేదు. సినిమా ప్రయత్నాలు ఎలా ఉన్నా, ఈమధ్య ప్రేమాయణం సాగిస్తున్నట్టు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తన ప్రియుడితో కలిసి మీడియా కంట పడడంతో సోనమ్ నిజంగానే ప్రేమాయణం సాగిస్తోందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంతకీ సోనమ్‌ని ప్రేమలో దించింది ఎవరో తెలుసా? ఆనంద్ అహూజా. సినిమా వాళ్లతో మంచి సంబంధాలే ఉన్న ఆనంద్‌తో చెట్టాపట్టాలేసుకొని తెగ తిరిగేస్తోందట. అంతేకాదు, ఈమధ్యే తన తండ్రి అనిల్‌కపూర్ 60వ పుట్టిన రోజు వేడుకలకు కూడా అతగాడిని తీసుకువచ్చిందట. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్‌జోహార్ నిర్వహిస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో కూడా సోనమ్ తాను ప్రేమలో ఉన్నానని చెప్పింది. అయితే అతగాడెవరో చెప్పడానికి మాత్రం ఇష్టపడలేదు. మొత్తానికి ఇన్నాళ్లు రహస్యంగా ప్రేమాయణం సాగించిన సోనమ్ ప్రేమకథ పెళ్లివరకు దారితీస్తుందో లేదో చూడాలి!