ఉందా లేదా’ పాటలకు ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామకృష్ణ, అంకిత జంటగా జయకమల్ ఆర్ట్ పతాకంపై అమనిగంటి వెంకట శివప్రసాద్ దర్శకత్వంలో ఐతం ఎస్ కమల్ రూపొందించిన చిత్రం ఉందా లేదా. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను ఇటీవల దర్శకుడు మారుతి విడుదల చేశారు. సినిమాలోని అన్ని పాటలు సూపర్‌హిట్ ట్రాక్‌లో నిలిచి నెంబర్‌వన్ స్థాయిలో ప్రేక్షక ఆదరణ పొందుతున్నాయని నిర్మాత ఎస్ కమల్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ- సినిమా టైటిల్ ఎంత క్యాచీగా వుందో అంతే క్యాచీగా ప్రతి పాటా వుందని, ప్రేక్షకులనుండి రెస్పాన్స్ లభిస్తోందని, ముఖ్యంగా టైటిల్ సాంగ్‌కు మంచి అప్లాజ్ వచ్చిందని తెలిపారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందించిన ఈ సినిమాకు సంబంధించిన డిఐ కార్యక్రమాలు జరుపుతున్నామని, ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి ఆదరణ లభించిందని తెలిపారు. హీరో హీరోయిన్లు కొత్తవాళ్లైనా సినిమాలో తమ పాత్రలను అద్భుతంగా పండించారని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో రూపొందించిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులతోపాటు యువతకు నచ్చుతుందని ఆయన వివరించారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:ప్రవీణ్ కె బంగారి, పాటలు:నాగరాజు, సంగీతం:శ్రీమురళి, నిర్మాత:ఐతం ఎస్.కమల్, కథ, దర్శకత్వం:అమనిగంటి వెంకట శివప్రసాద్.