పంజా దర్శకుడితో చరణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బ్రూస్‌లీ’ సినిమా తర్వాత మెగా హీరో రామ్‌చరణ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో హిట్టయిన ‘తని ఒరువన్’ చిత్రం ఆధారంగా ఇది రూపొందనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంచితే, తమిళ దర్శకుడు విష్ణువర్థన్ దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేయనున్నట్టు తాజాగా వార్తలొస్తున్నాయి. గతంలో పవన్‌కళ్యాణ్‌తో ఈ దర్శకుడు ‘పంజా’ చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు ప్రస్తుతం జరుగుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే కథా చర్చలు జోరుగా జరుగుతున్నాయి. స్టైలిష్ ఫిల్మ్‌మేకర్‌గా మంచి పేరు తెచ్చుకున్న విష్ణువర్థన్ తమిళంలో క్రేజీ దర్శకుడిగా ఉన్నారు. మరి ఈ సినిమాకు అన్నీ అనుకూలిస్తే త్వరలోనే సెట్స్‌పైకి వెళుతుంది.