రారా కోసం చూస్తున్నా చిరంజీవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాంత్ కథానాయకుడిగా విజిచరీష్ యూనిట్ దర్శకత్వంలో విజయ్, శ్రీమిత్రచౌదరి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘రారా’. ఈ చిత్రానికి సంబంధించిన తొలి ప్రచార చిత్రాన్ని చిరంజీవి తన స్వగృహంలో గురువారం ఉదయం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- హాస్యభరిత హారర్ చిత్రంగా రూపొందిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందని, తాను ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను చూశానని, సినిమా అంతా ఎప్పుడు చూస్తానా అని ఎదురుచూస్తున్నానని తెలిపారు. కథానుగుణంగా ఎన్నో గేమ్స్ వున్నాయని తెలిసి మరింత ఉత్సుకతతో సినిమాకోసం తాను ఎదురుచూస్తున్నానని, దెయ్యాలకు మనుషులకు మధ్య సాగే సరదా ఆటలు ప్రేక్షకుల్ని వినోదంతో అలరిస్తాయని ఆయన తెలిపారు. హారర్ కామెడీ థ్రిల్లర్ కథనంతో తాను తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని హీరో శ్రీకాంత్ తెలిపారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నామని, అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక వచ్చేనెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని నిర్మాత విజయ్ అన్నారు. నాజియా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో గిరిబాబు, సీత, నారాయం, అలి, రఘుబాబు, పోసాని కృష్ణమురళి, పృధ్వీ, జీవా, చంద్రకాంత్, హేమ, షకలక శంకర్, నల్లవేణు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం:రాప్రోక్ షకీల్, కెమెరా:పూర్ణ, ఫైట్స్:గిల్లే శేఖర్, ఎడిటింగ్:శంకర్, నిర్మాత:విజయ్, దర్శకత్వం:విజిచరిష్ యూనిట్.