జోరుమీదుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య మెగా హీరోలతో వరుసగా ఐటెం సాంగ్స్ చేస్తూ జోరుమీదుంది అందాల భామ రాయ్‌లక్ష్మి. పవన్‌తో సర్దార్ గబ్బర్‌సింగ్, చిరంజీవితో ‘ఖైదీ నెం 150’ సినిమాల్లోని ఐటెం సాంగ్స్‌తో తన కెరీర్‌గ్రాఫ్‌ని ఇంకాస్త పొడిగించుకుంది. ఈ సినిమాల తరువాత ఈ అమ్మడికి మరిన్ని ప్రత్యేక సాంగ్స్ చేయమని అవకాశాలు వస్తున్నాయట. ముఖ్యంగా లారెన్స్ నటిస్తున్న ‘మెట్టశివ కెట్ట శివ’, ‘శివలింగ’ చిత్రాల్లో ప్రత్యేక పాటల్లో కనిపించనుంది. దాంతోపాటు హిందీలో ‘జూలీ-2’ సినిమాలో నటిస్తున్న ఈమె, ఆ సినిమాలో గ్లామర్ షో చేయడానికి బరువు తగ్గానని, అందం కూడా రెట్టింపు అయిందని తెగ మురిసిపోతోంది. ముఖ్యంగా తనను చూసి చాలామంది అరేబియన్ గుర్రంలా వున్నావని పొగుడుతుంటే అదో గొప్ప ఫీలింగ్‌లా వుందని తెగ సంబరపడిపోతోంది. దానికితోడు ఈమధ్య హాట్ హాట్‌గా ఫొటోలకు ఫోజులిస్తూ సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. మొత్తానికి రాయ్‌లక్ష్మి జోరు ఇప్పట్లో తగ్గేలా లేదని అనుకుంటున్నారు సినీ జనాలు.

చిత్రం.. రాయ్‌లక్ష్మి