ఆకట్టుకునే గోదావరి అందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉషామూవీస్ సమర్పణలో ఆర్ ఫిలిం ఫ్యాక్టరీ, బొమ్మన ప్రొడక్షన్స్ పతాకాలపై రాజా రామ్మోహన్ చల్లా దర్శకత్వంలో తూమ రామారావు, బొమ్మన సుబ్బరాయుడు, రాజేష్ రంభల సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘కేరాఫ్ గోదావరి’ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 24న విడుదలవుతున్న సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సంగీత దర్శకుడు రవి కుంచె మాట్లాడుతూ- గోదావరి గురించి, అందులో ప్రయాణం గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. గోదావరి అందాలపై చాలా సినిమాలు వచ్చాయని, ఇళయరాజా, సత్యం, రమేష్‌ప్రసాద్, కె.ఎం.రాధాకృష్ణ లాంటి సంగీత దర్శకులు మంచి పాటలు అందించారని, అదే కోవలో నాకీ సినిమాను పాటలు చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని అన్నారు. నిర్మాత తూము రామారావు మాట్లాడుతూ- ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోందని, ముఖ్యంగా సినిమా చూసిన సెన్సార్ సభ్యులు పాటలు బాగున్నాయని అభినందించారు. సినిమా కూడా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉందన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈనెల 24న విడుదల చేస్తున్నామని అన్నారు. దర్శకుడు రాజా రామోహన్ మాట్లాడుతూ- గోదావరి గురించి ఎంత చెప్పినా తక్కువేనని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో అనుబంధం ఏర్పరచుకున్న గోదావరిపై తీసిన ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు కొత్తవాళ్లైనా అద్భుతంగా నటించారు. తప్పకుండా మా ప్రయత్నాన్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నానన్నారు.