ఆ ముద్ర వేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సొట్టబుగ్గల తాప్సికి తెలుగులో పెద్దగా కమర్షియల్ విజయాలు అందుకోలేకపోయింది. అవకాశాలైతే చాలానే పట్టేసింది కానీ అనుకున్న స్థాయిలో హీరోయిన్‌గా నిలబడలేకపోయింది. దాంతో అటు కోలీవుడ్‌లోనూ ట్రైచేసినా అదే పరిస్థితి. ఐదారేళ్లు ఇండస్ట్రీలో గట్టిగానే ప్రయత్నం చేసిన తాప్సి మొత్తానికి బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ ‘బేబి’, ‘పింక్’ చిత్రాలతో విజయాన్నందుకున్న తాప్సి, లేటెస్టుగా సౌత్ సినిమాపై చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. ఇంతకీ తాప్సీ ఏమందో తెలుసా? సౌత్‌లో హీరోయిన్లకు అంతగా ప్రాముఖ్యత ఉండదని, ముఖ్యంగా హీరోయిన్లు అంటే కేవలం గ్లామర్‌కే పరిమితమని అంటోంది. అంతేకాకుండా తనని సౌత్ పరిశ్రమ టార్గెట్ చేసిందని, తన టాలెంట్‌కు కాకుండా గ్లామర్‌కే పరిమితం చేశారని అంటోంది. ఇక్కడ తాను నటించే సినిమాలు ఫ్లాప్ అయితే తనను ఐరెన్ లెగ్ అని ముద్రవేశారని చెబుతోంది. తాను నటించిన సినిమా ఫ్లాప్ అయితే అందులో తన భాగమెంతుందో చెప్పాలని ఫైర్ అయింది. మొత్తానికి బాలీవుడ్‌లో కెరీర్ ఆశాజనకంగా వుండడంతో తాప్సి సౌత్ సినిమాపై ఇలాంటి ఘాటు కామెంట్లు చేస్తుందని అంటున్నారు సినీ జనాలు.

.