కోలీవుడ్‌లోకి చైతన్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత ఏడాది ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో సినిమాలతో మంచి విజయాలు అందుకుని జోరుమీదున్నాడు అక్కినేని నాగచైతన్య. దాంతోపాటు అందాల భామ సమంతతో ప్రేమాయణం సాగిస్తూ ఈమధ్యే నిశ్చితార్థం కూడా జరుపుకున్నాడు. ప్రస్తుతం కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న చైతన్య, తమిళంలోకి ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం. ప్రముఖ దర్శక నిర్మాత గౌతమ్‌మీనన్ నిర్మించే ఈ చిత్రంతో నాగచైతన్య కోలీవుడ్ ఎంట్రీ కన్‌ఫర్మ్ కానుంది. కార్తీక్ నరేన్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా హరర్ నేపథ్యంలో వుంటుందని, ‘నరగసూరన్’ టైటిల్‌తో రూపొందనుందని తెలిసింది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తారట. మరి తెలుగులో రొమాంటిక్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న చైతు, తమిళంలో ఎలాంటి హీరోగా నిలబడతాడో చూడాలి!