తమన్ పాడమంటే తమాషా అనుకున్నా యాంకర్ సుమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిధరమ్‌తేజ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు నిర్మిస్తున్న చిత్రం ‘విన్నర్’. ఈ చిత్రంలో గ్లామర్ యాంకర్ అనసూయ ప్రత్యేక పాటలో కన్పించగా, మరో యాంకర్ సుమ ఈ పాట పాడింది. ‘సూయ సూయ..’ అంటూ ఈ పాట సాగుతుంది. ఈ చిత్రం ఈనెల 24న విడుదలవుతున్న సందర్భంగా ఇద్దరు యాంకర్లు చెప్పిన విశేషాలు..
*సింగర్‌గా మారుతున్నారా?
సుమ: ఈ సినిమా కోసం పాట పాడాలని తమన్ అడిగినప్పుడు ఏదో తమాషా చేస్తున్నాడని అనుకున్నాను. కానీ తను సీరియస్‌గానే ఈ పాటను నాతో పాడించడానికి చెన్నైకి ఆహ్వానించాడు. సరేనని రికార్డింగ్ స్టూడియోకి చేరుకున్న తరువాత నేను పాడబోయే పాట ఏమిటో చెప్పారు. కానీ ఆ పాటలో అనసూయ డాన్స్ చేస్తుందని ఊహించలేదు.
అనసూయ:సుమ అక్క ఈ పాట పాడుతున్నారని నాకు ముందు తెలియదు. తమన్ కూడా ఎప్పుడూ చెప్పలేదు. ఓ రోజున సుమ స్టూడియోనుండి బయటికి వచ్చిన తరువాత ఈ విషయం చెప్పడంతో థ్రిల్ అయ్యాను.
* పాటకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది?
సుమ: సింగర్‌గా పాడిన మొదటి పాటకు ఇంత మంచి స్పందన రావడం ఆనందంగా వుంది. ఈమధ్య తమన్ చాలామంది స్టార్స్‌తో కూడా పాటలు పాడిస్తూ కొత్తదనాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆ నేపథ్యంలో ఈపాట పాడిన తరువాత నాకు చాలా ఆనందమేసింది.
అనసూయ:‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘క్షణం’ సినిమాల తరువాత ఇంతవరకూ మరే చిత్రంలో నటించలేదు. అందుకు కారణం నన్ను ప్రేక్షకులు ‘క్షణం’ అనసూయగానే గుర్తుపెట్టుకోవాలని అనుకున్నాను. నిజానికి ఈ సినిమాలో కూడా సాంగ్ చేయాలనుకోలేదు. కానీ పాటలోని లిరిక్స్ వినమని పంపించారు. ఆ పాటను నాకోసమే రాయడంతో అంగీకరించాను. పాట కూడా చక్కగా వచ్చింది. తప్పకుండా మంచి హిట్ అవుతుంది.
* పాటలు కొనసాగిస్తారా?
సుమ:దాని గురించి ఇప్పుడేమీ చెప్పలేం. ఎవరైనా నాతో పాడమని అడిగితే ట్రై చేస్తా.
అనసూయ: సుమ పాడిన పాటకు నేను డాన్స్ చేయడం కొత్త అనుభూతినిచ్చింది. తను మరిన్ని పాటలు పాడాలని కోరుకుంటున్నా. ఇక నేను స్పెషల్ సాంగ్‌ల విషయంలో ఇప్పుడేమీ చెప్పలేను.

-శ్రీ