ప్రేమికులకు భిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓం శ్రీ క్రియేషన్స్ పతాకంపై అనీల్‌కుమార్, శృతిలయ జంటగా ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో ఎం.ఎస్.బైరారెడ్డి, నాగరాజు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ప్రేమభిక్ష’. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, అనంతపురం జిల్లా భద్రగిరిపట్నం అనే కుగ్రామంలో 1970లో జరిగిన యధార్థ ఘటన ఆధారం చేసుకొని దర్శకుడు కథ రాయగా, దానికి ఆసక్తికరంగా స్క్రీన్‌ప్లే, మాటలు తోడవ్వడంతో సినిమా అందరికీ నచ్చేలా రూపొందిందని, 70 శాతం భద్రపట్టణంలోనే చిత్రీకరించి మిగతా షూటింగ్ కర్నాటకలోని కొన్ని అందమైన ప్రాంతాలలో చేశామని తెలిపారు. త్వరలో ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. సుమన్ ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో షఫి, జీవా, కవిత, సుమన్‌శెట్టి, రాజేంద్ర, గోపికర్ నటించారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రమోద్.ఆర్, నిర్మాతలు:ఎం.ఎస్.బైరారెడ్డి, నాగరాజు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఆర్.కె.గాంధి.