సస్పెన్స్ ఉందా లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయకమల్ ఆర్ట్ పతాకంపై అమనిగంటి వెంకట శివప్రసాద్ దర్శకత్వంలో రామకృష్ణ, అంకిత జంటగా అయితం ఎస్.కమల్ రూపొందిస్తున్న చిత్రం ‘ఉందా లేదా?’ ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఎస్.కమల్ మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయని, సస్సెన్స్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రానికి పెట్టిన టైటిలే బాగుందని అనేక మంది చెబుతుండడంతో సినిమాపై నమ్మకం పెరిగిందని తెలిపారు. ఇటీవల దర్శకుడు మారుతి, నటుడు శ్రీకాంత్ విడుదల చేసిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోందని, అలాగే టీజర్ కూడా మంచి రెస్పాన్స్ పొందిందని తెలిపారు. ఓ వెరైటీ కథాకథనంతో రూపొందించిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆయన తెలిపారు. ప్రేమికుల మధ్య ప్రేమ ఉందా లేదా, సినిమాలో కథాకథనాలలో సస్సెన్స్ ఉందా లేదా? అనే ప్రశ్నలకు ఈ సినిమా సమాధానం ఇస్తుందని, అందరూ కొత్తవారైనా బాగా నటించారని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో రూపొందిన ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు శివప్రసాద్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ కె.బంగారి, పాటలు: నాగరాజు, సంగీతం: శ్రీమురళి, కథ, దర్శకత్వం: అమనిగంటి వెంకట శివప్రసాద్.