కట్స్ లేకుండా విన్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్‌తేజ్ హీరోగా లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘విన్నర్’. బేబి భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మించారు. రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయిక. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఎలాంటి కట్స్ లేకుండా యు బై ఏ సర్ట్ఫికెట్ పొందడం విశేషం. ఇప్పటికే చిత్ర ట్రైలర్‌కు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసింది. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు సైతం చిత్ర యూనిట్‌ను ప్రశంసలతో ముంచెత్తడం మరో విశేషం.. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ‘ఊహించినట్టుగానే ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ పూర్తయింది. యు బై ఏ సర్ట్ఫికెట్ పొందిన విన్నర్‌కు సెన్సార్ సభ్యులనుంచి మంచి స్పందన లభించింది. హార్స్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 24న అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది’ అని అన్నారు. సాయిధరమ్‌తేజ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, ముఖేష్‌రుషి, అలీ, వెనె్నల కిశోర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: తమన్, ఆర్ట్: ప్రకాష్, కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: అబ్బూరి రవి, నృత్యాలు: రాజు సుందరం, శేఖర్, ఫైట్స్: సట్‌న్ శివ, రవివర్మ, ఎడిటర్: గౌతమ్‌రాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని.