వినాయక్‌తో 101 చిత్రం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సంక్రాంతికి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు బాలయ్య. నిజానికి ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాతో బాలయ్య యాభై కోట్ల మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇదే జోష్‌తో తన 101వ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన నెక్స్ట్ సినిమాకోసం క్రేజీ దర్శకులు అటు పూరి జగన్నాథ్, ఇటు కృష్ణవంశీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈమధ్యలో వినాయక్ కూడా బాలయ్యతో సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్‌గా మెగాస్టార్‌తో ‘ఖైదీ నంబర్ 150’తో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్న వినాయక్ బాలయ్యకోసం ఓ కథను సిద్ధం చేయించాడని తెలిసింది. ఇప్పటికే చర్చలు కూడా జరుగుతున్నాయని సమాచారం. ఇక ఎన్టీఆర్ జీవిత కథతో రూపొందే సినిమాకు ఇంకా టైం పట్టేలా ఉంది కాబట్టి.. వినాయక్ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘చెన్నకేశవరెడ్డి’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు రెడ్డి అనే పేరు వచ్చేలా టైటిల్ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో బాలయ్య నటించిన ‘సమరసింహారెడ్డి’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ కోవలో ఈ సినిమాకు అలాంటి టైటిల్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట!!