వెండితెరపై సారాఅలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీ సినిమాల్లోకి త్వరలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు బాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. కానీ దీనిని ఇంతవరకూ ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా ఈ విషయాన్ని సైఫ్ అలీఖాన్ ధ్రువీకరించారు. ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సారాఅలీ సినీ రంగప్రవేశం త్వరలోనే ఉంటుందని ప్రకటించాడు. కరణ్‌జోహార్ నిర్మాణంలో రానున్న ఓ చిత్రంలో తన కుమార్తె నటించనుందని తెలిపాడు. తన కుమార్తెని సినిమాల్లో పరిచయం చేయడానికి కరణ్ జోహార్ సరైన వ్యక్తి అని సైఫ్ తెలపడం విశేషం. కాగా అలనాటి నటి శ్రీదేవి కుమార్తె జాహ్నవి కూడా కరణ్‌జోహార్ తన చిత్రంలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.