ఉత్కంఠగా వైశాఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరీష్, అవంతిక జంటగా ఆర్.జె. సినిమాస్ పతాకంపై జయ.బి దర్శకత్వంలో బి.ఎ.రాజు రూపొందించిన చిత్రం వైశాఖం. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ సందర్భంగా దర్శకురాలు జయ మాట్లాడుతూ.. ప్రేమలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ సాగే ఈ చిత్రంలో వైశాఖ మాసానికి ఉన్న ప్రాముఖ్యం, ప్రాధాన్యత, పవిత్రత తెలియజేస్తున్నామని, అందుకే ఆ మాసంలోనే ఎక్కువగా పెళ్లిళ్లు జరగడానికి కారణాలను చూపిస్తున్నామని ఆమె తెలిపారు. శ్రీనివాసుడు పద్మావతి దేవిని వైశాఖ మాసంలోనే వివాహం చేసుకున్నారని, లవ్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో ఓ అమ్మాయి ఓ అబ్బాయి జీవితంలోకి వైశాఖంలా ప్రవేశిస్తే అతనిలో ఎలాంటి మార్పులు జరిగాయి అనే కథనంతో సినిమా ఉత్కంఠ భరితంగా సాగుతుందని తెలిపారు. వెరైటీ స్క్రీన్‌ప్లేతో రూపొందించిన ఈ చిత్రం అపార్ట్‌మెంట్ నేపథ్యంలో జరిగే ప్రేమ కథ అని, ఏప్రిల్‌లో వేసవి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత బి.ఎ.రాజు అన్నారు. సాయికుమార్ ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో రమాప్రభ, ఈశ్వరిరావు, పృథ్వి, కాశీ విశ్వనాథ్, కృష్ణ్భగవాన్, శ్రీలక్ష్మి, గుండు సుదర్శన్, లావణ్య తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.