యమన్ కథ కల్పితమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ ఆంటోని హీరోగా మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్, లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై జీవ శంకర్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘యమన్’. యమన్ ఈ శివరాత్రికి విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్ ఆంటోని మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు...
* ‘యమన్’ అంటే?
- ఇది పొలిటికల్ థ్రిల్లర్. దీనికి ఎలాంటి స్ఫూర్తి లేదు. మేం దీన్ని పూర్తిగా క్రియేట్ చేశాం. నా సినిమా ‘నకిలీ’ చూశారా? అది కూడా ఊహాజనితమైన చిత్రం. ఇది కూడా అలాంటిదే. మనకి రాజకీయవేత్తల గురించి తెలుసు. వాళ్లు ఎలా ఉంటారు? ఎలా పనులను చేస్తారు? వంటివన్నీ మనకు బాగా తెలుసు. వాటిని దృష్టిలో ఉంచుకుని కల్పితగాథను అల్లుకున్నాం. ఇందులో కథ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఒక మామూలు వ్యక్తి ఎలా మంత్రి అయ్యాడన్నది ఇందులో ప్రధానాంశం.
* రీసెర్చ్ చేశారా?
- ఈ కథకు రీసెర్చ్ చేయాల్సినంత అవసరం లేదు. మనందరికీ పాలిటిక్స్ తెలుసు. దాన్ని దృష్టిలో ఉంచుకుని చేశాం. ఇందులోనే కాదండీ ఏ సినిమా అయినా విలన్ ఉంటే అందులో డార్క్‌సైడ్‌ని చూపించవచ్చు. మన సొసైటీని గురించి చెప్పాం.
* ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు
ఉత్కంఠను క్రియేట్ చేస్తున్నాయి..
- ఈ కథను మేం రాసుకుని ఐదేళ్లయింది. ఇప్పుడున్న పరిస్థితులకు, మా సినిమాకు ఎలాంటి సంబంధమూ ఉండదు. తమిళనాడు పాలిటిక్స్ కరెంట్ సినారియో ఉండదు. మా కథ ముంబై, ఆంధ్రతోపాటు ఏ రాష్ట్రానికైనా సరిపోతుంది.
రాజకీయాలు వేరుగా ఉండవచ్చేమో కానీ, రాజకీయ నాయకులు ఎక్కడైనా ఒకే విధంగా వుంటారు. కేవలం లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉంటుందేమో కానీ అందరూ ఒకేలా ఉంటారు. కొందరు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఉండవచ్చు. మరికొందరు స్వీయార్జనే ధ్యేయంగా వచ్చి ఉండవచ్చు. రాజకీయ నాయకుల్లోనూ రకరకాల వ్యక్తులు ఉంటారు. 30 శాతం మంచివారు ఉంటే, 70 శాతం మంది ధనార్జనకే వస్తారు.
* టైటిల్ జస్ట్ఫికేషన్ ఏంటి?
- చెడు చేసేవారి పట్ల యముడు అతడు అనే అర్థంలో పెట్టాం. యమన్ అంటే శివుడి అవతారమే. ధర్మాన్ని కాపాడేవాడు యమధర్మరాజు. మిగిలిన అందరి దేవుళ్లలో యముడు చాలా మంచి దేవుడు. కానీ మనం ఆయన్ని వేరే రకంగానే ఇనే్నళ్లుగా చూశాం.
* మీకోసం కథలో ఏమైనా మార్పులు చేశారా?
- అలాంటివేమీ లేవు. నేను నిర్మాతగా, సంగీత దర్శకుడిగా ఈ చిత్ర దర్శకుడికి సాయం చేశానంతే.
* ఈ సినిమా కోసం బరువు పెరిగారట కదా?
- చాలా తక్కువ పెరిగాను.
* తమిళనాడులో ఇప్పుడు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయనుకుంటారు?
- ఏం ఫర్వాలేదు. మా థియేట్రికల్ ట్రైలర్ చాలా బాగా వచ్చింది. సినిమా కోసం వేచి చూస్తున్నారు. కాకపోతే నెలాఖరు కాబట్టి ఎవరిదగ్గరన్నా డబ్బులు అటూ ఇటూ అయి సినిమా చూడరేమోననే ఆలోచన తప్ప మా సినిమాకు వచ్చిన ఇబ్బందేమీ లేదు.
* బేతాళుడు సినిమా పరాజయంపట్ల
మీరెలా స్పందిస్తారు?
- అది చాలా మంచి సినిమా. కాకపోతే అందులో చాలా చిన్న మిస్టేక్ చేశాం. రిలీజ్ చేసిన తర్వాత మాకు అది తెలిసింది. విలన్‌ని ఫస్ట్ఫాలో రివీల్ చేయడంవల్ల జయలక్ష్మి పాత్రను మరింత ఎక్స్‌పెక్ట్ చేశారు. కాని ఈ అంచనాలను సినిమా అందుకోలేకపోయింది. ఆ చిత్రం తమిళ వెర్షన్ పెద్ద హిట్. కేవలం నాలుగు రోజుల్లోనే అక్కడ పెట్టుబడులను వసూలు చేసింది.
*నిర్మాతగా ఉంటూ నటించడం ఇబ్బంది కాలేదా?
- కొన్నిసార్లు ఇబ్బందే అవుతుంది. ఎందుకంటే నిర్మాతగా కొన్ని రాత్రులు నిద్రపట్టదు. కానీ నటుడిగా తెరమీద గ్లామర్‌గా కనిపించాలంటే నిద్ర తప్పకుండా పోవాల్సిందే. కానీ కుదరదు. అందుకే ఇందాక చెప్పాను కదా.. యమన్ లాంటి కథలకు హీరో అందంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఈ తరహా సినిమాల్లో నటించవచ్చు. హిట్ కొట్టవచ్చు.
* తెలుగులో సినిమా చేస్తానన్నారు?
- ఈ ఏడాది చేస్తా.

-శ్రీ